బోయకొండలో నూతన పాలక మండళి ప్రమాణస్వీకారం
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలక మండళి స్రభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పార్టీ నేతలు హాజరు కానున్నారు. నూతనంగా నీయమితులైన సభ్యుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ మిథున్‌రెడ్డిల ఆశీస్సులతో చైర్మన్ గా నాగరాజారెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. సభ్యులుగా పి. రజని,కె. రామ్‌దాస్,జి.భారతి, ఏ. రాజేష్,ఎం. బుడ్డమ్మ,ఎస్. పవన్‌కుమార్,ఎన్. భాస్కర్‌రెడ్డి ,సి.లక్ష్మిదేవమ్మ ,కె.హైమావతి ,డి.రెడ్డెమ్మ లతోపాటు ఎక్సె అఫిషియోమెంబర్‌గా గంగిరెడ్డి చేత దేవాదాయశాఖ నిబంధనలమేరకు ప్రమాణస్వీకారం చేయించ నున్నారు . ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags: New Governing Council sworn in at Boyakonda

