వానకాలంలో కొత్త అతిథులు
ఖమ్మం ముచ్చట్లు:
మన ఊరు, మన గుడి, మన గుట్ట.. అనుకుని ఓ పెద్దామె చాలారోజుల తర్వాత చెట్లపొదలు తొలగి స్తుంటే సర్రున నాగరాజు లేచి పలకరించాడు. అంతే బామ్మగారు అమాంతం వెల్లకిలా పడి లేచి ఇంటి దాకా పరిగె త్తింది. పాములు, కప్పలు, తేళ్లకు వీలు చిక్కాలే గాని ఇళ్లలోకి రావడానికే మహా తొందర పడుతూంటా యి. ఇపుడు వాటి ఆ సరదానే భద్రాచలం జిల్లాలో ప్రజలను వణికిస్తోంది. భారీవర్షాలు, ఇటివల కురిసిన భారీ వర్షాలకి భద్రాచలం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిం దే. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజలు కొంత కోలుకుంటున్నారు.భారీ వర్షాలతో గోదావరి తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా ఇప్పుడిప్పుడే గోదారమ్మ శాంతి స్తుంది. ఈ క్రమంలో పునరావాసాల నుంచి ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల బాధితులు ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వరదనీటితోపాటు ఇళ్లలో, వాడల్లో పాములు, తేళ్లు, మొసళ్లు, ఇతర ప్రమాదకర జీవులు చేరి గజగజ వణికిస్తున్నాయి. వాటికి మనుషులు లేకపోతే ఆ ఇల్లు తమదేనన్న భావన ఉంటుందేమో! ఇళ్లలోకి వచ్చినవాటి సంగతి సరే. పొలంలోకి ఎప్పుడు వచ్చిందో బురద నీటిలో హాయిగా పడుకున్న మొసలి పిల్ల కంటపడింది. అంతే పొలంలోకి వెళ్లిన రైతులు భయంతో పరుగులు తీశారు. ఎక్కడో ఉండాల్సిన మొసలి పిల్లదయినాసరే ఇలా తారసపడటం ఖంగారుపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు కంగుతిన్నారు. బురదలో ఏదో కదలడం చూశారు. దగ్గరికి వెళ్లగా అది మొసలి పిల్లగా నిర్ధారించారు. పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యానిమల్ రెస్క్యూ టీమ్ పంట పొలంలో ఉన్న మొసలి పిల్లను పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. వరదలకు అడవుల్లోని విష పురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.వీటిని గుర్తిస్తే చంపకుండా. . తమకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు నల్లాలను శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రజ లంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే నీటిని వాడుకోవాలని కోరుతున్నారు.
Tags: New guests in rainy season