హెచ్‌ఎండిఏ లే ఔట్ల అనుమతుల్లో కొత్త మార్గదర్శకాలు

Date:15/07/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హెచ్‌ఎండిఏ లే ఔట్ల అనుమతుల్లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా లే ఔట్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఎంఏయూడి విభాగం మార్గనిర్ధేశాలను జారీ చేసింది. 2013 నాటికి ఉన్న నిబంధనల ప్రకారం పబ్లిక్ లేదా ప్రైవేటు రోడ్డు నుంచి వెంచర్ ఉండే అప్రోచ్ రోడ్డు 9 మీటర్లకు (30 ఫీట్లకు) తక్కువ కాకుండా ఉండే వెంచర్లకు ఈ నిబంధనలను వర్తింపచేశారు.ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా వందఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉంటేనే లే ఔట్లకు అనుమతులు మంజూరు చేస్తామని తాజాగా విడుదల చేసిన జిఓల్లో హెచ్‌ఎండిఏ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హెచ్‌ఎండిఏ ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించిందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే అనుమతుల కోసం పెట్టుకున్న వెంచర్లకు సైతం ఈ జిఓ వర్తిస్తుందని కమిషనర్ అరవింద్‌ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత రోడ్డు 100 ఫీట్ల కన్నా తక్కువగా ఉంటే వారి లే ఔట్‌కు మిగిలిన రోడ్డు చూపిస్తేనే అనుమతులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

 

 

కొత్తగా వచ్చే ఏ లే ఔట్ అయినా వందఫీట్లకు తగ్గకుండా అప్రోచ్ రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే వేసిన రోడ్డు వందఫీట్ల కన్నా తక్కువగా ఉంటే పబ్లిక్ రోడ్డు నుంచి వెంచర్ వరకు 100 ఫీట్ల రోడ్డును వేసుకోవాలని ఈ నూతన మార్గదర్శకాల్లో హెచ్‌ఎండిఏ సూచించింది. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.ప్రస్తుత రోడ్డు వెడల్పు 80 (ఫీట్ల) నుంచి 100 లోపు ఉంటే డెవలప్‌మెంట్ చార్జీలు 50 శాతంగా, 60 నుంచి 80 (ఫీట్ల) లోపు రోడ్డు వెడల్పుఉంటే డెవలప్‌మెంట్ చార్జీలు 66 శాతం, 30 నుంచి 60 (ఫీట్ల) లోపు రోడ్డు వెడల్పు ఉంటే 100 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 100 ప్లాట్ల కన్నా ఎక్కువగా ఉండి నాన్ హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతి కోసం 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండిఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవన్నీ ఇప్పటికే డ్రాఫ్ట్ లే ఔట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, అలాగే లే ఔట్ విత్ హౌసింగ్ (ఓపెన్, గేటెడ్‌కు) సైతం వర్తించనున్నాయి.

సీఎంవోలో 1500 పైగా ఫైల్స్

Tags:New guidelines on HMDA layout permits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *