సెక్స్ డాల్ ఆర్డర్ కు కొత్త చిక్కులు

New implications for sex doll order

New implications for sex doll order

 Date:17/09/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఆన్‌లైన్లో సెక్స్ డాల్ కొనుగోలు చేసిన ఓ ఇంగ్లిష్ వ్యక్తి ఊహించని రీతిలో కష్టాల్లో పడ్డాడు. చిన్నపిల్ల సైజ్ వెర్షన్లో ఉన్న బొమ్మను కొనుగోలు చేయడమే ఇందుకు కారణమైంది. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ‘ఒంటరి’ భావన వేధించిందని నాథన్ వాట్స్  క్రౌన్ కోర్టుకు తెలిపాడు. వేర్‌హౌస్ మేనేజర్‌గా పనిచేసే వాట్స్.. వెయ్యి పౌండ్లు వెచ్చించి ఆన్‌లైన్లో సిలికాన్ డాల్ ఆర్డర్ చేశాడు.చైనాలోని షెన్జెన్ నుంచి ఆ బొమ్మ ఎప్పుడొస్తుందా అని అతడెంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటే.. ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్ ఆఫీసర్లు సీజ్ చేశారని తెలిసి షాకయ్యాడు.
తాను జపనీస్ అమ్మాయి ముఖ కవళికలతో పెద్ద అమ్మాయి సైజులో ఉండే డాల్‌ను కొనుగోలు చేశానని వాట్ పోలీసులకు చెప్పాడు. నేను అనుకున్న దాని కంటే ఆర్డర్ చేశాక వచ్చిన బొమ్మ చిన్నగా ఉందని తెలిపాడు. వెబ్‌సైట్లో ఆ బొమ్మ సైజుకు సంబంధించిన సమాచారం ఏదీ లేదని తెలిపాడు.అచ్చం మనిషిని పోలినట్టే అన్ని అవయవాలు ఉన్న ఈ బొమ్మ కేవలం 4 అడుగుల 3 అంగుళాల ఎత్తు మాత్రమే ఉందని ఈ కేసును విచారించిన జ్యూరీ తెలిపింది.
అది అచ్చం చిన్న పిల్లలాగే ఉందని, పూర్తి స్థాయిలో వక్షోజాలు ఏర్పడినట్టు ఉండటం మాత్రమే దీనికి మినహాయింపని తెలిపింది.ఆ బొమ్మ 4 అడుగుల 3 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. యుక్త వయసులోకి వచ్చిన మహిళ అంత ఎత్తు లేదు. కానీ అది 22 కిలోల బరువు ఉంది. అంతకంటే ఎక్కువ బరువున్న బొమ్మను చైనాను దిగుమతి చేసుకోవడం ప్రాక్టికల్‌గా సాధ్యపడదని’ వాట్ తరఫున వాదించిన లాయర్ తెలిపాడు.
Tags:New implications for sex doll order

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *