కాంగ్రెస్ లో కొత్త జోష్…

Date:19/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు కొంత జోష్ తెప్పించే పనిలో పడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెమ్మదించిన రాహుల్ గాంధీ మళ్లీ స్పీడందుకోవడంతో పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నైరాశ్యంలో పడింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ రోజురోజుకూ దిగజారిపోతుండటంతో ఆ పార్టీ అభిమానులు సయితం ఆందోళనకు గురయ్యారు. మరోవైపు నాయకత్వాన్ని స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు.ఈ నేపథ్యంలో వరసగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరి నిచ్చాయనే చెప్పాలి. ప్రధానంగా హాథ్రాస్ ఘటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వ్యవహరించిన తీరు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు పటిష్టమైన కొన్ని వర్గాల  ఓటు బ్యాంకు ఈ ఘటనతో తిరిగి పార్టీ దరికి చేరిందన్న వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.

 

హాథ్రాస్ ఘటనకు వెళ్లేముందు రాహుల్ గాంధీని కిందపడేయటం కూడా ఆయనతో పాటు పార్టీకి బోలెడంత సానుభూతిని తెచ్చిపెట్టింది.ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పంజాబ్ లో స్వయంగా నిరసనల్లో పాల్గొన్నారు. ట్రాక్టర్లతో రైతులు జరిపిన ర్యాలీలో పాల్గొని రాహుల్ గాంధీ వారికి సంఘీభావం తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ కొంత నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిందనే చెప్పాలి. అనేక రాష్ట్రాల నుంచి రాహుల్ పిలుపునకు స్పందన బాగా రావడంతో నేతల్లోనూ ఉత్సాహం నెలకొంది.గత పదిహేడు నెలలుగా రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప క్షేత్రస్థాయి కార్యక్రమాలను చేపట్టలేదు. తాజగా హథ్రాస్, రైతు ఉద్యమాల్లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొనడటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. ఇదే రీతిలో రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళితే మోదీ పై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ యాక్టివ్ కావడంతో పార్టీలో కూడా కొత్త ఉత్సాహం నెలకొందనే చెప్పాలి.

 

క‌ల్యాణక‌ట్టను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tags:New Josh in Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *