సైబరాబాద్  బాధ్యతలు స్వీకరించిన కొత్త కొత్వాల్ సజ్జనార్

Date:14/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
సైబరాబాద్  నూతన పోలీసు కమిషనర్ గా వి సి సజ్జనార్  బుధవారం నాడు  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు  కమిషనర్ గా  కొనసాగిన సందీప్ శాండిల్య  బుధవారం  సజ్జనార్ కు  బాధ్యతలను అప్పగించారు.  1996  బ్యాచ్ ఐసీఎస్ కు చెందిన వి సి సజ్జనార్  ఉత్తమ పనితీరుతో అనేక అవార్డులు అందుకున్నారు.  గతంలొ సజ్జనార్  ఎస్పీ గా నల్గొండ, కడప, గుంటూరు, వరంగల్, మంగళగిరి, మెదక్  అలాగే  ఇ ఓ డబ్ల్యు  సి ఐ డి విభాగం ,  కమాండెంట్ 6 వ బెటాలియన్ విభాగం,   ఆక్టోపస్ విభాగాలకు ఎస్పీ  గా పని చేశారు. వరంగల్ జనగాం జిల్లా, కడప పులివెందుల,  కొత్తగూడెం  ఖమ్మం జిల్లాలకు ఏ ఎస్పీ గా పని చేశారు. అంతే కాకుండా ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ విభాగానికి ఐ జి పి,  డి ఐ జి గా కూడా పని చేసి ఎంతో మంది ప్రజల మన్ననలను పొందారు.  పలు  అవార్డులను తన స్వంతం చేసుకున్నారు.
Tags: New Kotwal Sajjanar who took charge in Cyberabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *