Natyam ad

ఐటి సోదాలకు స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేట ముచ్చట్లు;


తన నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఐటి సోదాలపై ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్న.. అప్పటి నుంచి నాది వైట్ పేపర్ మీదనే ఉంటది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ . నా ఇంటిపై ఐటి దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమి కాదు. వారు చేసే ఐటి సోదాలో ఎలాంటి ఆధారాలు ఉండవు. నాకు ఎవరితో పొత్తులుండవు, వేరే దందాలుండవు. ఇంతకు ముందు ఎపుడు లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. ఇది కేవలం బురదజల్లే ప్రయత్నం. మాదగ్గర ఎన్ని ఆస్తులున్న ఆధారాలతో సహా చూపిస్తానని అన్నారు.
Tags:New MP Prabhakar Reddy responded to IT searches

Post Midle