పారిశ్రామిక ప్రగతికి కొత్త విధానాలు: మంత్రి కేటీఆర్

New Procedures for Industrial Progress: Minister Ketiar

New Procedures for Industrial Progress: Minister Ketiar

Date:23/11/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
పరిశ్రమలు మూతపడే స్థితి నుంచి.. విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.పారిశ్రామిక ఇబ్బందులు తెలుసుకుని.. అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి నట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రగతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మంత్రి మాట్లాడుతూ మిషన్‌భగీరథ ప్రాజెక్టును టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే దాదాపు పూర్తయితే,ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టును కాంగ్రెస్ పాలకులు 40 ఏళ్ల పాటు నిర్మించారని తెలిపారు. తాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 1956లో ఆంధ్ర-తెలంగాణ కలిసే నాటికే హైదరాబాద్ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉంది. ఏ ప్రాంత ఆదాయం ఆ ప్రాంతంపైనే ఖర్చు చేయాలనేది పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధాన అంశం. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఉల్లంఘన తర్వాతే తెలంగాణలో ఉద్యమం మొదలైంది. 1968లో తెలంగాణలో మిగులు ఆదాయం ఉందని విఠల్ కమిషన్ వెల్లడించిందన్నారు.రాష్ట్రం ఏర్పడిన 6నెలల్లోపే..రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోపే విద్యుత్ సమస్య తీర్చారని పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలు మూతపడే స్థితి నుంచి.. విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించింది. పారిశ్రామిక ఇబ్బందులు తెలుసుకుని.. అభివృద్ధికి కృషి చేశారు. పారిశ్రామిక ప్రగతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకువచ్చింది. మూతపడే స్థితిలోని చిన్న పరిశ్రమలకు చేయూతనిచ్చారని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.
Tags: New Procedures for Industrial Progress: Minister Ketiar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *