చంద్రయాన్ తో కొత్త పుంతలు

New Pundits with Chandrayaan

New Pundits with Chandrayaan

Date:15/07/2019

నెల్లూరు ముచ్చట్లు:

ఒకేసారి అత్యధిక శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలతో శభాష్ అనిపించుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ .. ‘చంద్రయాన్-2’తో మరో అద్భుతానికి తెరతీయనుంది. తొలిసారిగా ‘రోబోటిక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్’తో చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ‘చంద్రయాన్-2’ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

 

 

అయితే, రాకెట్లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో లాంచింగ్కు గంట ముందు వాయిదా పడింది. ఈ ప్రయోగానికి ముందు ఇస్రో భారతీయుల నుంచి తమ అభిప్రాయాలను కోరింది. చంద్రుడి మీదకు ఏం తీసుకెళ్లాలని ప్రశ్నించింది. ఇందుకు అద్భుతమైన జవాబులు లభించాయి. వీరిలో అత్యధిక ప్రజలు మన జాతీయ జెండాను తీసుకెళ్లాలని చెప్పడం గమనార్హం.

 

 

 

 

ఈ సందర్భంగా ఇస్రో దేశవ్యాప్తంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రజలంతా మన త్రివర్ణ పతకాన్ని చంద్రుడిపై రెపరెపలాడించాలని కోరుతున్నారని ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నుంచి వచ్చిన సమాధానాలను ట్వీట్ చేసింది. విశాఖపట్నానికి చెందిన గణేష్ జీఎన్ఎస్.. జాతీయ జెండా, కెమేరా, ఆహారం, కుర్చీ, టెలీస్కోప్ తీసుకెళ్లాలని సూచించాడని పేర్కొంది.

 

 

 

 

హైదరాబాద్కు చెందిన విగ్నేశ్వర్ రాయల్ కర్రోతు జాతీయ జెండా, ఇస్రో లోగోతో ఉన్న టీషర్ట్, మ్యూజిక్ ప్లేయర్ ఉన్న హెడ్సెట్, ద అల్కెమిస్ట్ పుస్తకం, తను పుట్టిన ఊరి నుంచి మట్టి తీసుకెళ్లాలని తెలిపారు. హైదరాబాద్కు చెందిన సిద్దాంత్ సెనాయ్.. జాతీయ జెండా, డిజిటల్ కెమేరా, సోలార్ ఛార్జర్, బంగాళ దుంపలు, శాంపిల్స్ తీసుకోడానికి టెస్ట్యూబ్లు తీసుకెళ్లాలని సూచించాడు. ఇంకొందరు మన మట్టిని, విత్తనాలు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

 

 

 

ఎవరిని తీసుకెళ్లాలనే ప్రశ్నపై ఇంకొందరు ఫన్నీగా కూడా స్పందిస్తున్నారు. చాలామంది నేరగాళ్లను, అవినీతిపరులను, రాజకీయ నేతలను తీసుకెళ్లి వదిలేయాలని కోరుతున్నారు. కొందరు మోదీ, రాహుల్ గాంధీ, సన్నీలియోన్, మంజ్రేజకర్, ఆవులను కూడా తీసుకెళ్లి అక్కడ వదిలేసి రావాలని అంటున్నారు. ఇంకా ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో చూడండి.

హైస్కూల్‌లో వాసవిక్లబ్‌ సేవలు

Tags: New Pundits with Chandrayaan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *