రంగారెడ్డిలో కొత్తగా 30 వేల ఓట్లు

Date:21/05/2018
రంగారెడ్డి ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల లెక్క కొలిక్కి రావడంతో అధికారులు రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీ ఓటర్ల గణన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అందువల్లనే ఓటర్ల జాబితా ముసాయిదా గత నెల 8వ తేదీన ప్రకటించగానే రాజకీయపార్టీల కార్యకర్తలు, ఎన్నికల బరిలో దిగాలనుకునేవారు అప్రమత్తమయ్యారు. ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకున్నారు. గత నెల 8వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి సవరణలు కోరగానే వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి.నగర శివారులు సహా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 560 పంచాయతీలు, 5020 వార్డుల పరిధిలో బీసీ ఓటర్ల గణన జరుగుతుంది. జూన్‌ మొదటి వారం నాటికి బీసీ ఓటర్ల సంఖ్య తేల్చి తుది జాబితా ప్రకటిస్తారు. పంచాయతీలకు ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే చర్చలు జోరందుకున్నాయి.సవరణలు కోరుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని ఓటర్ల జాబితాలో చేర్చి అధికారులు తుది జాబితా విడుదల చేశారు. ఈ మేరకు ముసాయిదా కంటే సుమారు 29,926 ఓట్లు పెరిగాయి. ముసాయిదా జాబితా ప్రకటించినప్పుడు 6,22,556 ఓట్లు ఉంటే సవరణల అనంతరం తుది జాబితాలో మొత్తం 6,52,482 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. పెరిగిన ఓట్లలో 15,321 పురుషులవి, 14,601 మహిళలవి. మొత్తం ఓట్లలో 3,37,156 పురుషులు.. 3,15,271 మహిళలు, 55 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు.
 Tags:New Ranga Reddy 30 thousand votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *