Natyam ad

ఆగస్ట్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!

అమరావతి ముచ్చట్లు:

ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.
ఆగస్ట్‌ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం.బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్‌ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది.పీఎం కిసాన్‌ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్‌ఎన్‌వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యం లేదు.పీఎంఎఫ్‌బీవై

 

Post Midle

రిజిస్ట్రేషన్:

 

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్‌లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైన్‌లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది.ఎల్‌పీజీ గ్యాస్‌ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్‌ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి.ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

 

Tags; New rules to be changed from August 1..! These are..!

Post Midle