ప్రణయ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

New twist in Pranay murder case

New twist in Pranay murder case

 Date:19/09/2018
నల్గొండ ముచ్చట్లు:
ప్రణయ్‌ హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమృతవర్షిణి తండ్రి మారుతీరావుకు సహకరించినవారిలో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మిర్యాలగూడ‌కు చెందిన కాంగ్రెస్ నేత కరీం ప్రధాన ముద్దాయిలో ఒకడిగా ఉన్నాడు.  కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నాయకుడు కూడా ఈ కేసుకు సహకరించాడని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ప్రణయ్ హత్య జరిగిన వెంటనే అతని భార్య అమృత టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేరును ఎందుకు చెప్పింది?’’ అని ప్రశ్నించారు. గురువారం నల్గొండ ఎస్పీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గురించి ఎందుకు చెప్పలేదు? ఆయన్ని ఎందుకు విచారించలేదు? అని ప్రశ్నించారు.
అతనికి ఎలాంటి నోటీసు పంపకుండా, విచారించకుండా అతని ప్రమేయం లేదని ఎలా నిర్ణయిస్తారు? ఈ కేసులో అతని ప్రమేయం గురించి పోలీసులు విచారణ జరపాలి అని డిమాండు చేశారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి. ఈ నెల 16న మీడియాతో మాట్లాడిన అమృత.. ‘‘ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రణయ్‌ను, నన్ను కలవాలని పిలిచారు. నల్గొండలోని కొన్ని క్రిమినల్ కేసులతో ఆయనకు సంబంధం ఉందని తెలిసి ప్రణయ్, నేను ఆయన్ను కలిసేందుకు భయపడ్డాం.
పోలీసుల ద్వారా ప్రణయ్‌ను బెదిరించేందుకు ప్రయత్నించారు. దీంతో మేము ఐజీ స్టిఫెన్ రవింద్రను కలిశాం’’ అని ఆమె స్థానిక మీడియాకు వెల్లడించినట్లు కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. దీనిపై టీఆర్‌ఎస్ పార్టీ కేశవరావు స్పందిస్తూ.. ‘‘ఈ కేసులో ఎమ్మెల్యే వేముల ప్రమేయం ఉందని అమృత ఆరోపించినట్లు నేను ఎక్కడా వినలేదు. ఈ కేసుతో ఎవరికి ప్రమేయమున్నా కోర్టు చూసుకుంటుంది.
ఇది కిరాతక ఘటన. నిందితులకు కఠినంగా శిక్షించాలి’’ అని తెలిపారు.దీనిపై బుధవారం పోలీసులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేముల కేవలం ఆ జంటకు సలహా మాత్రమే ఇచ్చారని తెలిపారు. తనది కూడా కులాంతర వివాహమేనని, ఇప్పుడు తాను హ్యాపీగా ఉన్నానని అమృత, ప్రణయ్‌లకు చెప్పారన్నారు. పెళ్లికి ముందు ఇరువురి పెద్దలను ఒప్పించడం మంచిదని వారికి తాను సూచించానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
Tags:New twist in Pranay murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *