2,392 new corona positive cases confirmed in Telangana

దేశంలో కొత్తగా 46,791 కరోనా కేసులు

Date:20/10/2020

దిల్లీ ముచ్చట్లు:

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. సోమవారం 10,32,795 నమూనాలను పరీక్షించగా 46,791 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు చేరింది. గడిచిన మూడు నెలల్లో 50,000 లోపు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 587 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,15,197 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 69,720 మంది డిశ్ఛార్జి కావడంతో.. ఇప్పటి వరకూ 67,33,329 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,48,538 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది.గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీల రేటు పెరుగుతోంది. దాదాపు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మరణాల రేటు 1.52 శాతంగా ఉందని బులిటెన్‌లో పేర్కొంది. .

ఏపీకి భారీ వర్ష సూచన 

Tags:Newly 46,791 corona cases in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *