హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐయే సోదాలు

హైదరాబాద్ ముచ్చట్లు:


హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐయే అధికారులు గురువారం సోదాలు జరిపారు. ఉప్పల్ చిలుకానగర్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి. రెండేళ్లుగా కనిపించకుండాపోయిన నర్సింగ్ విద్యార్థిని రాధరాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు అయింది. నర్సింగ్ విద్య చదువుతున్ప రాధను నక్సల్స్లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈ నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు ఎన్ఐఏకు అప్పగించారు. విశాఖలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. మూడేళ్ల క్రితం తమ కూతురు రాధను కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందింది. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని తల్లి ఆరోపణ. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని రాధ తల్లి చెబుతోంది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కోంది. గత మూడేళ్లుగా నర్సింగ్ విద్యార్థిని రాధ ఇంటికి తిరిగి రాలేదు.

 

Tags: NIA searches at High Court Advocate Shilpa’s house

Post Midle
Post Midle
Natyam ad