ఏపీలో నిఫ్ట్ అడుగులు…

Nift feet in AP ...

Nift feet in AP ...

Date:19/09/2018
విజయవాడ ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అమరావతిలో త్వరలోనే రూ.300 కోట్లతో ‘నిఫ్ట్’ నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. ‘నిఫ్ట్‌’ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శివలింగం ఆధ్వర్యంలో ఓ బృందం బుధవారం  అమరావతిలో పర్యటించింది. ‘
నిఫ్ట్’ స్థలాన్ని పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
పరిశీలన అనంతరం చేనేత శాఖామాత్యులు అచ్చెంనాయుడు ఈ బృందం సమావేశమైంది. నిఫ్ట్ ఏర్పాటుకు సుమారుగా ౩౦ ఎకరాల స్థలం అవసరమవుతుందని, సంస్థ తరఫున కార్యాలయ ఏర్పాటుకు రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు డైరెక్టర్ శివలింగం ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.
ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా మొత్తం 9 కోర్సులను విద్యార్థులకు అందించనున్నట్లు మంత్రికి శివలింగం తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు స్థల కేటాయింపుపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని బృందానికి హామీ ఇచ్చారు.
Tags:Nift feet in AP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *