కాలపత్తర్ లో  రాత్రిపూట బైకర్స్‌ వీరంగం..

హైదరాబాద్ ముచ్చట్లు:


చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టినా, విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు యువకులు అర్థరాత్రుళ్లు బైకులతో రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఇటువంటి ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌ పాతబస్తీలో కొందరు యువకులు ర్యాష్‌ డ్రైవింగ్‌తో హల్‌చల్‌ చేశారు.హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం సృష్టించారు. కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. అడ్డుకున్న ఓ యువకుడిని బైకర్స్ చితకబాదారు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. బైకర్స్‌ దాడిలో మహిళలు, యువకులకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Tags: Night bikers in Kalapathar ..

Post Midle
Post Midle
Natyam ad