తమిళనాడులో నైట్ కర్ఫ్యూ

చెన్నై ముచ్చట్లు:
 
మిక్రాన్‌, కరోనా కొమ్ములు వంచడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ‘సండే లాక్‌డౌన్’ అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక ఆర్టీసీ బస్సుల్లో 50 సీటింగ్‌ వరకే అనుమతినిచ్చింది. విద్యాసంస్థలు, పార్క్‌లు మూసేయాలని, థియేటర్లులో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో పొంగల్‌ వేడుకలను పూర్తిగా నిషేధించింది. కాగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, షాపులు మూసివేస్తారు. ఇక ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పెట్రోల్‌ బంకులు తెరిచే ఉంటాయి. కాగా కేసులను బట్టి కర్ఫ్యూ సమయాన్ని మరింత పొడిగించే సమయం ఉందని సమాచారం.కాగా తమిళనాడులో కొత్తగా 2, 371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,55,587కి చేరింది. మరో 9 మంది కరోనాతో మృత్యువాతపడడ్డారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 36,085కి చేరింది. మరోవైపు తమిళనాడులో ఇప్పటివరకూ 121 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలోనే నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్‌లను అమలుచేయాలని తమిళనాడు సర్కార్‌ నిర్ణయించింది. కాగా ఇప్పటికే బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్‌, హరియానా.. తదితర రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Night curfew in Tamil Nadu

Natyam ad