నిరాశ్ర‌యుల‌కు వ‌ర‌ప్ర‌సాదంగా మారిన నైట్ షెల్ట‌ర్లు

Date:17/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైద‌రాబాద్‌లో గ‌త వారంరోజులుగా కురుస్తున్న ఎడ‌తెర‌ఫిలేకుండా కురుస్తున్న ముసురు నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ గ్రేట‌ర్‌లో ఏర్పాటు చేసిన నైట్ షెల్ట‌ర్ల నిరాశ్ర‌యుల‌కు వ‌ర‌ప్ర‌సాదంగా మారాయి. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఇత‌ర రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుండి ప్ర‌తిరోజు ల‌క్ష‌లాది మంది వివిధ ప‌నుల నిమిత్తం వ‌స్తారు. వీరిలో అధిక‌శాతం మంది పేద‌లు, ఏవిధ‌మైన ఆధారంలేకుండా జీవ‌నోపాధి అవ‌కాశాల‌కై న‌గ‌రానికి వ‌చ్చేవారు ఉన్నారు. ఇలాంటి నిరాశ్ర‌యులు, నిర్భాగ్యుల‌కు నీడ‌నిస్తూ ఆదుకుంటున్నాయి నైట్‌షెల్ట‌రు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 1516 మంది నిరాశ్ర‌యులు ఉన్నార‌ని జీహెచ్ఎంసీ నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది. వీరిలో 1128మంది పురుషులు, 328మంది మ‌హిళ‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఉన్న 12 నైట్‌షెల్ట‌ర్ల‌లో 530 మంది త‌ల దాచుకుంటున్నారు. ప్ర‌ధానంగా 7 ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రులు, ప్ర‌ధాన మార్గాల‌లో ఉన్న నైట్‌షెల్ట‌ర్లు చ‌లి, వాన నుండి రక్షిస్తూ రాత్రి బ‌స‌ను క‌ల్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న 12 నైట్ షెల్ట‌ర్ల‌లో 8 షెల్ట‌ర్లు పురుషుల‌కు ఉండ‌గా నాలుగు ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కు ఉన్నాయి. వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను సేవారంగంలో పేరొందిన స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అప్ప‌గించారు. ఈ షెల్ట‌ర్ హోంల‌లో ఆశ్ర‌యం క‌ల్పించేవారి ఆధార్‌, ఓట‌ర్ గుర్తింపుల‌తో పాటు బ్యాంకు ఖాతాల‌ను కూడా తెరుస్తారు. ఈ నైట్ షెల్ట‌ర్లలో ఉండేవారికి ప్రైవేట్ రంగంలో తగు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను కూడా జీహెచ్ఎంసీ క‌ల్పిస్తోంది.
రూ. 9.71 కోట్ల‌తో మ‌రో 7 నైట్ షెల్ట‌ర్ల నిర్మాణం
హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ. 9.71 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో 7 నైట్ షెల్ట‌ర్ల నిర్మాణాల‌ను చేప‌ట్ట‌గా వీటిలో మూడు పూర్త‌యి, మ‌రో 4 నిర్మాణంలో ఉన్నాయి. మెట‌ర్న‌టి ఆసుప‌త్రి, కింగ్‌కోటి, మ‌హ‌వీర్ ఆసుప‌త్రి, మాసాబ్‌ట్యాంక్‌, నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలోని నైట్ షెల్ట‌ర్లు ఉప‌యోగంలోకి వ‌చ్చాయి. ఇవి కాక మ‌రో నాలుగు నైట్‌షెల్ట‌ర్లు  రూ. 928 కోట్ల వ్య‌యంతో ప్ర‌ధాన ఆసుప‌త్రుల  వ‌ద్ద నిర్మాణంలో ఉన్నాయి.
* రూ. 290 కోట్ల వ్య‌యంతో కింగ్‌కోటిలోని ప్ర‌భుత్వ ఇ.ఎన్‌.టి ఆసుప‌త్రి
* రూ. 261 కోట్ల వ్య‌యంతో నిమ్స్ ఆసుప‌త్రిలో
* రూ. 277 కోట్ల‌తో అఫ్జ‌ల్‌గంజ్ ఉస్మానియా ఆసుప‌త్రి
ఇవే కాక ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు క‌మ్యునిటీ హాళ్ల‌ను నైట్‌షెల్ట‌ర్లుగా ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇవి ఉప్ప‌ల్‌లోని దేవేంద్ర‌న‌గ‌ర్ క‌మ్యునిటిహాల్‌, ముషిరాబాద్ స‌ర్కిల్‌లోని రోజ్ కాల‌నీ క‌మ్యునిటీ హాల్‌, చందాన‌గ‌ర్‌లోని హ‌ఫీజ్‌పేట్ కమ్యునిటీహాల్‌, బేగంపేట స‌ర్కిల్‌లోని బేగంపేట పోస్ట్ ఆఫీస్ క‌మ్యునిటి హాళ్లు ఉన్నాయి.
ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా న‌డుస్తున్న నైట్ షెల్ట‌ర్లు
1. ఉప్ప‌ల్ స‌ర్కిల్‌లోని పాత మున్సిప‌ల్ ఆఫీస్‌,  ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్‌లోని స‌రూర్‌న‌గ‌ర్ పాత చావ‌డి భ‌వ‌నం. అంబ‌ర్‌పేట స‌ర్కిల్ గోల్నాక క్రాంతి న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, సికింద్రాబాద్ స‌ర్కిల్ నామాల‌గుండులో  నైట్ షెల్ట‌ర్లు ఉన్నాయి.
పురుషుల‌కు నైట్‌షెల్ట‌ర్లు  చార్మినార్ స‌ర్కిల్‌లోని పేట్ల‌బుర్జు వార్డు ఆఫీస్‌, గోషామ‌హ‌ల్ స‌ర్కిల్ శివ‌రాంప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీ,  యూసుఫ్‌గూడ‌లోని వార్డు కార్యాల‌యం మొద‌టి అంత‌స్తు,  ఖైర‌తాబాద్ స‌ర్కిల్‌లోని బేగంపేట ఫ్లైఓవ‌ర్ క్రింద‌, గ‌చ్చిబౌలి స‌ర్కిల్ శేరిలింగంప‌ల్లి పాత మున్సిప‌ల్ కార్యాల‌యం,  మ‌ల్కాజ్‌గిరి స‌ర్కిల్‌లోని ఆర్‌.కె.పురం బ్రిడ్జి స‌మీపంలో,  సికింద్రాబాద్ బేగంపేట ఫ్లైఓవ‌ర్ బ్రాహ్మ‌ణ‌వాడి, మెహిదీప‌ట్నం స‌ర్కిల్ మాసాబ్‌ట్యాంక్ మ‌హ‌వీర్ ఆసుప‌త్రి,  గోషామ‌హ‌ల్‌లోని కోటి ప్ర‌భుత్వ మెట‌ర్న‌టీ ఆసుప‌త్రి,  రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ శివ‌రాంప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీ,  మెహిదీప‌ట్నం స‌ర్కిల్‌లోని నీలోఫ‌ర్ ఆసుప‌త్రి.
నిరాశ్ర‌యుల‌కు వ‌ర‌ప్ర‌సాదంగా మారిన నైట్ షెల్ట‌ర్లుhttps://www.telugumuchatlu.com/night-shellers-who-have-become-a-shelter-for-the-homeless/
Tags: Night shellers who have become a shelter for the homeless

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *