రాత్రికి రాత్రే.. (సిరిసిల్ల)

Night to Night .. (Cyrillilla)

Night to Night .. (Cyrillilla)

Date:12/10/2018
సిరిసిల్ల  ముచ్చట్లు:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుంచి రాత్రిపూట కలప అక్రమంగా రవాణా అవుతోంది. కొంతమంది గుట్టలున్న గ్రామాల నుంచి విలువైన కలపను రాత్రిపూట సైకిళ్లపై అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా పలువురు కలప దొంగలు శుక్రవారం రాత్రి వేములవాడ మండలం వట్టెంల గ్రామస్తులకు పట్టుపడ్డారు. ఈ ఒక్క గ్రామమే కాదు.. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాత్రిపూట కలప దొంగలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందిస్తే.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. వేములవాడ మండలం నూకలమర్రి, ఫాజుల్‌నగర్‌లో ఫారెస్టు గుట్టలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి స్మగ్లర్లు అక్రమంగా చెట్లను నరికివేస్తూ.. కలపను రవాణా చేస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లం చెరువు నుంచి ఫాజుల్‌నగర్‌ బీట్‌ మీదుగా వట్టెంల చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు చందుర్తి, కోనరావుపేట, జోగాపూర్‌ ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున కలపను ప్రతిరోజు రాత్రిపూట కొంతమంది ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై తరలిస్తున్నట్లు వట్టెంల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఫారెస్ట్‌ అధికారులు స్పందించి చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, నూకలమర్రి, ఫాజుల్‌నగర్‌ ప్రధాన కూడళ్ల వద్ద స్ట్రైకింగ్‌ ఫోర్స్, బేస్‌క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
గుట్టల ప్రాంతం నుంచి విలువైన టేకుకలపను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలిసింది.
టేకు కలపకు ధర ఎక్కువగా పలుకుతుండడంతో అక్రమంగా సంపాదించేందుకు ఈ దారి ఎంచుకున్నట్లు తెలిసింది. కలప దొంగలు టేకు చెట్లు ఉన్న గుట్టప్రాంతాలకు వెళ్లి చెట్లను నరికివేసి, అక్కడే దాచి ఉంచుతారు. సెలవు దినాలు, పండుగ రోజుల్లో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై కట్టె మిషన్లకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలపను శుద్ధి చేసి  విక్రయిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం వట్టెంలలో సైకిళ్లపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కలపను తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కార్పెంటర్లు అక్కడి వెళ్లి కలప తరలిస్తున్న విషయం బయటకు రాకుండా ఉండాలని చెప్పినట్లు సమాచారం.
Tags:Night to Night .. (Cyrillilla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *