నిఖిల్ హీరోగా నూతన చిత్రం

Nikhil as hero

Nikhil as hero

Date:03/12/2019

నిర్మాత బన్నీ వాసుకు, డైరెక్టర్ సుకుమార్ కు మధ్య ప్రొఫెషనల్ గా. పర్సనల్ గా ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసిందే. ఆర్య చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి… సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చిన సూపర్ హిట్ చిత్రం హండ్రెండ్ పర్సంట్ లవ్ తో నిర్మాతగా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు బన్నీ వాసు. ఈ సూపర్ హిట్ కలయికలో ఇప్పుడు మరో సినిమా రానుంది. సుకుమార్, బన్నీ వాసు నిర్మాతలుగా ఓ అద్భుతమైన కథను ఫైనల్ చేశారు. వరుస హిట్స్ తో నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఇందులో  హీరోగా నటించబోతున్నాడు. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తొలి సినిమాతోనే అందుకున్న ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కించే ఈ చిత్రాన్ని జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో గ్రాండియర్ గా నిర్మించనున్నారు.

 

 

 

 

 

 

మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించి మంచి విజయాల్ని అందించిన ఘనత జిఏ 2 పిక్చర్స్ కి ఉంది. ఇప్పుడు నిఖిల్ కు సైతం అద్భుతమైన విజయం ఈ సంస్థనుంచి వస్తుందని ఆశిస్తున్నారు. నాగచైతన్య తో హండ్రెడ్ పర్సంట్ లవ్, నానితో భలే భలే మగాడివోయ్, విజయ్ దేవరకొండతో గీత గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలు జిఏ2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందించారు. ఇక ఇప్పుడు తొలిసారిగా నిఖిల్ తో చేస్తున్న సినిమా కూడా భారీ విజయం అందుకుంటుందనే ధీమాగా ఉన్నారు. అల్లు అరవింద్, సుకుమార్, బన్నీ వాసు లాంటి అనుభవజ్ఞులు ఈ కథను ఓకే చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు… ఈ సినిమా విజయం ఎలా ఉండబోతుందనేది. నిఖిల్ కూడా ఈ చిత్రం కథ విన్న వెంటనే ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో,  అల్లు అరవింద్ సమర్పణలో, సుకుమార్, బన్నీ వాసు లాంటి నిర్మాతలతో కలిసి వర్క్ చేస్తుండడంతో… నిఖిల్ కెరీర్ మరో కీలక మలుపు తీసకుంటుందని కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కు టర్నింగ్ పాయింట్ గా  నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.  ప్రతాప్ కుమారి 21 ఎఫ్ తో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో నెక్ట్స్ లెవల్ కు వెళ్తాడని ఆశిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 

సందడి సందడిగా ‘మా’ వనభోజనాలు

 

Tags:Nikhil as hero

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *