నీలకంఠాపురం ఆలయం సిద్దం

మడకశిర  ముచ్చట్లు :
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరెడ్డి నూతనంగా నిర్మించిన ఆలయాలు ప్రారంభో త్సవానికి సిద్ద మయ్యాయి.  ఈ నెల 19 నుండి 23 వరకు జరుగు నూతన ఆలయాల ప్రారంభోత్సవాలకు ముస్తాబు అవుతున్న వేళ ఆలయ శుద్ధి చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు గంగుళవాయి పాళ్యం పంచాయతీ ప్రజలు,ఉదయాన్నే మహిళలు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన ఆలయ శుద్ది కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు మాజీ మంత్రి రఘువీరా పాల్గొని వారికి సహాయం చేసారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన డానికి మాకు అవకాశం కల్పించిన రఘువీరారెడ్డి కుటుంబసభ్యులకు గంగుళవాయి పాళ్యం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియ చేసారు.అనంతరం ఆలయ సుద్ది కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికి రఘువీరా సతీమణి సునీత రఘువీర్ మాస్కులు పంపిణీచేసి ,అన్నదానం చేసారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Nilakanthapuram temple ready

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *