నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తాను ప్రకటించుకోవడం చెల్లదు

-ఎపి ఆడ్వకేట్ జనరల్ శ్రీరామ్

Date:31/05/2020

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తాను ప్రకటించుకోవడం చెల్లదని ఎపి ఆడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటించారు. తాను హైకోర్టు జడ్జిమెంట్ సర్టిఫైడ్ కాపీ చూసిన తర్వాత, అందులోని అంశాల ఆధారంగా ప్రబుత్వానికి ఈ విషయం తెలిచేశానని ఆయన తెలిపారు. రాత్రి ఆయన మీడియాకు వివరించారు. సాదారణంగా న్యాయనిపుణులు మీడియా ముందుకు రారని, కాని హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అమలు చేయవలసి ఉందని, దానిని పూర్తిగా చదివిన తర్వాత అందులోని అంశాలపై సుప్రింకోర్టుకు వెళ్లడానికి నిర్ణయించామని ఆయన అన్నారు.ఇందుకోసం దీనిపై స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని ఆయన అన్నారు.హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వానికి అదికారం లేదని, ఆ ప్రకారం అయితే గతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సలహా మేరకు జరిగిన రమేష్ కుమార్ నియామకం చెల్లదని ఆయన అన్నారు.రమేష్ కుమార్ తనకు తాను ఎన్నికల కమిషనర్ గా ప్రకటించుకోవడం చట్టవిరుద్దమని ఆయన అన్నారు.హైదరాబాద్ లో ఉండి ఆయన ఇక్కడి అదికారులకు ఆదేశాలు ఇచ్చారని,వాటిని పాటించవలసిన అవసరం లేదని తాను ప్రభుత్వ అదికారులకు తెలియచేశానని అన్నారు. ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిషన్ గా ఉన్న ప్రభాకర్ ను రాజీనామా చేయాలని రమేష్ కుమార్ కోరారని, ఆ విషయం తనకు ప్రభాకర్ తెలిపారని, తాను వాటిని పాటించవలసిన అవసరం లేదని చెప్పానని ఆయన అన్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కొత్త ట్విస్టు వచ్చింది.హైకోర్టు తన తీర్పు అమలుకు కాల పరిమితి పెడుతుందని, అలా లేకపోతే రెండు నెలలు టైమ్ ఉంటుందని శ్రీరామ్ చెప్పారు.

జూన్ 30 వరకు లాక్ డౌన్

Tags: Nimegadda Ramesh Kumar declares himself invalid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *