తొమ్మిదిమంది దొంగలు ఆరెస్టు
కడప ముచ్చట్లు:
కడప జిల్లా జిల్లాలోని పులివెందుల అర్బన్, రూరల్, కడప వన్ టౌన్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా విచారణలో వెల్లడయింది. మరో ముగ్గురిపై పలు దొంగతనం కేసుల్లో నింధితులు అయినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. నిందితులనుంచి 17 లక్షల విలువ చేసే 314 గ్రాములు బంగారం నగలు, 80 గ్రాములు వెండి, 45 వేల రూపాయలు నగదు, 2 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప వన్ సిఐ నాగరాజు, పులివెందుల అర్బన్, రూరల్ సిఐలు రాజు, బాల మద్దిలేటి తదితరులు పాల్గోన్నారు.
Tags: Nine thieves were arrested

