నిర్భయ దోషులకు త్వరలో ఉరి.. సిద్ధమైన మీరట్ జైలు తలారీ

Nirbhaya convicts soon to be executed

Nirbhaya convicts soon to be executed

Date:14/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇందుకు బక్సార్ జైల్లోని ఖైదీలు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. దోషులను ఉరితీయడానికి తీహార్ జైల్లో తలారీ లేకపోవడంతో ఉరితీసే వ్యక్తి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉరితీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని యూపీలోని మీరట్ జైలు చెందిన తలారీ జలాద్ తెలిపారు. జైలు అధికారులు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు తిహార్‌కు వెళ్లడానికి తాను సిద్ధమేనని అన్నాడు. నిర్భయ దోషుల ఉరికి రంగం సిద్ధమవుతోందని వార్తల నేపథ్యంలో తిహార్‌ జైలు నుంచి యూపీ జైళ్ల శాఖకు ఓ లేఖ అందింది. ఇద్దరు తలారీలను సిద్ధంగా ఉంచాలని అందులో పేర్కొన్నారు. వీరిలో లక్నోకు చెందిన తలారీ అనారోగ్యంతో ఉండడంతో మీరట్‌కు చెందిన తలారీ సిద్ధంగా ఉన్నాడని లక్నో అదనపు డీజీపీ (జైళ్లు) ఆనంద్‌కుమార్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో మీరట్‌కు చెందిన తలారీ జలాద్‌ (55) పీటీఐతో మాట్లాడుతూ.. ఉరితీయబోయే వ్యక్తులెవరనేది తనకు సమాచారం లేదని తెలిపాడు.

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం నిర్భయ దోషులకు ఉరితీస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో వారే అయ్యి ఉండొచ్చని ఆయన అన్నారు. అలాగే మీరట్ జైలు అధికారుల నుంచి ఇంత వరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదని, ఆదేశాలొచ్చిన 24 గంటల్లో తిహార్‌ జైలుకు చేరుకుంటానని జలాద్ వ్యాఖ్యానించాడు.కాగా, తాము ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నామని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె చనిపోయిన రోజే నిందితులను ఉరితీయాలని కోరారు. నిర్భయ దోషి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తెను కిరాతకంగా హత్యచేసిన దోషులను ఉరితీసే వరకూ న్యాయం కోసం పోరాడుతామని ఈ సందర్భంగా అన్నారు. నిర్భయ తల్లి దాఖలుచేసిన పిటిషన్‌ను డిసెంబరు 17న సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు, నలుగురు దోషుల డెత్ వారెంట్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు డిసెంబరు 18 వాదనలను విననుంది.

 

దూర విద్యా కేంద్రం పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్

 

Tags:Nirbhaya convicts soon to be executed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *