నిర్మల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు

Nirmal is the chief minister of KCR

Nirmal is the chief minister of KCR

Date:31/12/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్‌కు వరాలను కురిపించారు. జిల్లా అభివృద్ధి పథం లో దూసుకెళ్తుందని ప్రజలు పశ్చిమాన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల వారీగా సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు.
 నిర్మల్ జిల్లాను సాధిం చడంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, ఎమ్మె ల్యే ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి గెలవడంతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా నిర్మల్‌కు మెడికల్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ స్వయ ంగా నిర్మల్‌కు మెడికల్ కళాశాల వస్తుందని ఎన్నికల సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్‌లో రిమ్స్ ఉండగా.. నిర్మల్‌కు సైతం మెడికల్ కళాశాల వస్తే ఇక్కడ నిరుపేద గిరిజన ప్రాంతాల ప్రజలకు చుట్టు పక్కల ఉన్న మంచిర్యాల, ఆర్మూర్ వాసు లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని కేసీఆర్ ఖానాపూర్ సభలో ప్రకటించారు.
దాంతో పాటు ఇక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నియోజక వర్గంలోని 1.2లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, దీంతో ఇక్కడ వ్యవసాయం సస్యశ్యామలం కానుంది.తెలంగాణ రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిర్మల్‌లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని కేసీఆర్ ఎన్నికల సభలో హామీచ్చారు. దీంతో నిర్మల్ పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్మూర్, నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ తీసుకవస్తామని కేసీఆర్ వరాలు ప్రకటించారు.ఇందు కు సంబంధించి కేంద్రంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రైల్వే లైన్ పూర్తయితే ఇక్కడ పండించిన పంటలు సరుకు రవాణా, ఎగుమతి, దిగుమతి కూడా సులభతరం అవుతుంది. ఏదీ ఏమైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నేరితే నిర్మల్ జిల్లా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లనుంది.
Tags:Nirmal is the chief minister of KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *