Natyam ad

శ్రీవారికి ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు

తిరుపతి ముచ్చట్లు:


భారత గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో  ఏవి.ధర్మారెడ్డి ప్రసంగించారు.
ఈవో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలి అధ్యక్షులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

 

 

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ మరోసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను తెలియజేస్తున్నాను.
శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర పండితుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 6.06 లక్షల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించాం.  వైకుంఠ ద్వార దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా 197 ఎస్సి, ఎస్టి, బిసి గ్రామాల నుంచి 9700 మందికి దర్శనభాగ్యం కల్పించాం. వీరందరికి ఉచిత రవాణా, వసతి, ఆహారం అందించామని అన్నారు.

 

 

Post Midle

సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు క్యూ లైన్లలో కిలోమీటర్ల దూరం చలిలో వేచి ఉండి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబరు 1 నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. – దీనివల్ల భక్తులు తిరుపతిలో టోకెన్ తీసుకుని వారికి కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని, సత్వరమే దర్శనం చేసుకునేందుకు ఈ విధానం ఉత్తమమైనదిగా భావించామని అన్నారు.
డిసెంబరు 1 నుండి బ్రేక్ దర్శన సమయం మార్పు
శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు నిరీక్షణ సమయం తగ్గించేందుకు, ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబరు 1వ తేదీ నుండి విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 5.30 నుండి 8 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నాం. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతుండటంతో మరో రెండు నెలలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

 

 

 

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :
జనవరి 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశాం.  ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.  వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, కాఫీ, టీ, పాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.  నాలుగు మాడవీధుల్లో ఎండవేడి తగలకుండా అక్కడక్కడ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఎస్వీ మ్యూజియం
టాటా సంస్థ విరాళంగా అందించిన రూ.120 కోట్లతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో శ్రీవారి ఆభరణాల 3డి ఇమేజితోపాటు ఇతర కళాఖండాలను ప్రదర్శిస్తాం.

 

 

 

నూతన పరకామణి
మురళీకృష్ణ అనే దాత సహాయంతో రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు.
లడ్డూప్రసాదం
శ్రీవారి లడ్డూలను మరింత నాణ్యంగా, ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు వీలుగా రిలయన్స్ అధినేత శ్రీ ముఖేష్ అంబానీ విరాళంగా అందించే రూ.50 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి  నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం.
అరచేతిలో సమాచార దర్శిని
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానం విజయవంతమైంది. భక్తుల కోసం త్వరలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని అయన అన్నారు.

 

Tags: Nityakainkaryas are agamoktanga to Sri

Post Midle