– నీట మునిగిన పంటలు
– నేలకూలిన స్తంబాలు, చెట్లు
– వర్షపాతం 118.6 మిల్లిలు
Date:26/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
రెండు రోజులుగా నివర్ తుఫాను భీభత్సానికి పంటలు నీట మునిగి దెబ్బతింది. పుంగనూరులోని మేలుపట్ల , మార్కెట్‌యార్డు, చిత్తూరు రోడ్డు, ముళబాగిల్ రోడ్డు, మంగళం కాలనీ, వనమలదిన్నె రోడ్డులో చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకూలింది. గురువారం తీవ్ర వర్షం కురుస్తున్నా కమిషనర్ కెఎల్.వర్మ ఆధ్వర్యంలో సచివాలు ఉద్యోగులు, వలంటీర్లు సహాయక చర్యలు స్వయంగా చేపట్టారు. అలాగే సీఐ గంగిరెడ్డి, తహశీల్ధార్ వెంకట్రాయులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. కమిషనర్ మార్కెట్ యార్డు వద్ద పడిపోయిన చెట్లను కమిషనర్ స్వయంగా తొలగించారు. అలాగే మంగళం కాలనీలో కూలిపోయిన విద్యుత్ స్తంభాలను జెసిబి సహాయంతో తొలగించి, పునరుద్దరించారు. తహశీల్ధార్ మాట్లాడుతూ మండలంలో 14 గృహాలలో నీరు చేరిందన్నారు. 42 విద్యుత్ స్తంభాలు కూలిపోయిందన్నారు. పెద్దగడదేశిలో చెరువుకు గండిపడే అవకాశం ఉండగా జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 118.6 మిల్లిల వర్షపాతం నమోదైందన్నారు. కానీ విద్యుత్ గంటల తరబడి లేకపోవడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. అలాగే పూడిపోయిన మురుగునీటి కాలువలను తొలగించి, నీటి నిల్వలు లేకుండ చేపట్టారు.
కాల్ సెంటర్ ఏర్పాటు…
మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను ప్రజలకు తుఫాను వల్ల ఎలాంటి అంతరాయం కలిగిన తక్షణం మున్సిపాలిటి కాల్‌సెంటర్ : 08581-252166 కు సమాచారం అందించాలని కమిషనర్ కెఎల్.వర్మ కోరారు. 16 సచివాలయాల కార్యదర్శులు, వలంటీర్లకు కూడ ఆయా ప్రాంత వాసులు సమాచారం అందించాలని, తక్షణమే సహాయక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
మండలంలో…..
మండలంలోని చండ్రమాకులపల్లె, ఈడిగపల్లె, బండ్లపల్లె, నేతిగుట్లపల్లె, సుగాలిమిట్ట, పట్రపల్లె, మంగళం , కుమ్మరగుంట తదితర గ్రామాల్లో వరి , టమోటా, బీన్స్, కొత్తిమీర, ఆకుకూరల పంటలు దెబ్బతింది. పంటలు నేలమట్టమై, నీట మునిగింది. ఏవో సంధ్య వర్షంలోనే పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు. వరి పంట నేలపడిపోవడంపై ఆమె మాట్లాడుతూ రైతులు ఒక ఎకరాకు 5 కీలోల చొప్పున ఉప్పును చల్లాలన్నారు. దీని ద్వారా వరి పంట నల్లపడకుండ వెహోలకెత్తకుండ ఉంటుందన్నారు. పంటలను పూర్తిగా పరిశీలించి నష్టంపై జిల్లా కలెక్టర్‌కు వెంటనే నివేదికలు పంపుతామన్నారు.
డిసెంబరు 1 నుండి 5వ తేదీ వరకు టిటిడిలో వస్త్రాల ఈ – వేలం
Tags: Nivar flood terror