101 రమ్ బాటిల్స్ తో నైవేద్యం

Nivaya with 101 rum baits
Date:19/03/2019
తిరువనంతపురం ముచ్చట్లు:
ఆలయంలో నైవేద్యంగా ఏ పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్లో సమర్పిస్తారు. కానీ, కేరళలోని ఓ ఆలయంలో మాత్రం వీటికి విరుద్దంగా మద్యాన్ని సమర్పించే విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. కొల్లం జిల్లాలోని ఎడక్కాడ్‌లో దుర్యోధనుడికి ఓ ఆలయం ఉంది. ఇది దక్షిణ భారత దేశంలో దుర్యోధనుడికి ఉన్న ఏకైక ఆలయం.. పుర్వాయ్ పెర్వుర్తి మలంద ఆలయం. ఇక్కడ ఏటా ఉత్సవాలను నిర్వహించి, మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. శుక్రవారం ప్రారంభమైన వార్షికోత్సవాల్లో భాగంగా 101 ఓల్డ్ మంక్ రమ్ బాటిల్స్‌ను నివేదించారు. స్థలపురాణం ప్రకారం.. ఒకసారి దుర్యోధనుడు ఈ ప్రాంతం గుండా వెళ్తూ దాహం వేయడంతో మలకంద్ గ్రామానికి వచ్చి తాగడానికి నీళ్లు అడిగాడు. దీంతో ఓ వ్యక్తి ఆయనకు కల్లు ఇవ్వడంతో తాగి తృప్తిచెందాడని అంటారు. మలంద ఆలయ కార్యదర్శి ఎస్బీ జగదీశ్ మాట్లాడుతూ… సాధారణంగా విదేశీ మద్యాన్ని భక్తులు సమర్పిస్తారని తెలిపారు. గతంలో సారాయి సమర్పించేవారిని దీనిపై నిషేధం విధించడంతో కల్లు, విదేశీ మద్యం మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు.
వీటితోపాటు చికెన్, పాన్, మేకలు, పట్టు వస్త్రాలను కూడా భక్తులు సమర్పించుకుంటారని వెల్లడించారు. ప్రస్తుత ఉత్సవాల్లో కొల్లం పట్టణానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ 101 మద్య సీసాలను ఈ ఆలయంలో సమర్పించినట్టు వివరించారు. అన్ని మతాలకు చెందివారూ ఇక్కడకు వస్తారని, మత్స్యకారులు ఈ గుడిలో జెండాను తమ వెంట తీసుకువెళతారన్నారు. తమను సమస్యల నుంచి గట్టెక్కించే అపోపన్‌గా పిలుచుకుంటారు. విదేశాల్లో ఉండే కేరళవాసులు తమ స్వస్థలానికి వచ్చేటప్పడు ఈ ఆలయాన్ని సందర్శించి, తమ వెంట తెచ్చిన విదేశీ మద్యాన్ని నివేదిస్తారని కిరణ్ దీపు అనే స్థానికుడు తెలిపాడు. వీరు సమర్పించిన మద్యాన్ని గుడి ఆవరణలోనే వేలం వేసి అమ్ముతారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో మద్యం సమర్పించడం ఇప్పటి వరకు 22 సార్లు మాత్రమే జరిగిందని వివరించాడు.
ఇక, ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి గర్బగుడి కూడా లేని ఈ ఆలయం 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఇక ఆలయ కమిటీలో అన్ని కులాల వారికి చోటు కల్పిస్తారు. ఎన్నికలు నిర్వహించి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా కూడా కాల్చే సంప్రదాయం కొనసాగుతున్న 1990లో బాణ సంచా పేలుడు వల్ల ప్రమాదం జరిగి 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అప్పటి నుంచి వీటిని నిషేధించారు. కేవలం మలందాలోనే కాదు కన్నూరులోని పరశింకదువు ముత్తప్పన్ ఆలయంలోనూ విదేశీ మద్యాన్ని వినియోగిస్తారు. కానీ, గత ఐదేళ్ల నుంచి ఇక్కడ మద్యాన్ని సమర్పించే సంప్రదాయానికి స్వస్తి పలికారు.
Tags:Nivaya with 101 rum baits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *