టాప్ టెన్ లో నిజామాబాద్ బల్దియా

Date:13/03/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
స్వచ్ఛత సర్వేక్షణ్-2018 ర్యాంక్ సాధనలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో అరుదైన రికార్డును బద్దలు కొట్టింది. ఈ నెల 10 వరకు జరిగిన సర్వే గణాంకాల్లో స్వచ్ఛత సర్వేక్షణ్ యాప్ డౌన్‌లోడ్‌లో అఖిల భారత స్థాయిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచి కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నెలాఖరు వరకు లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌లో ఆన్‌లైన్ సేవల్లో స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్ కీలకంగా మారనుంది. స్వచ్ఛత సర్వేక్షణ్ యాప్ డౌన్ లోడ్‌లో 10వ ర్యాంకును లక్ష నుంచి 10 లక్షల జనాభా లోపు నగరాల్లో నిజామాబాద్ నిలిచిందని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో వివరాలను వెల్లడించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్ఛత సర్వేక్షణ్‌ను 19283 మంది నగర పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో యాప్‌ను 5,605 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సిటిజన్ బడ్డి ద్వారా 13,571 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజిస్ట్రేషన్ అసలు లక్ష్యం 6,223 కాగా 19,283 మంది రిజిస్ట్రేషన్ల ద్వారా మనం 300 శాతం ఎక్కువగా చేసుకున్నట్లయింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు కార్పొరేషన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పేర్కొన్న అంశాలపై 18066 మంది ఆన్‌లైన్‌లో కైంప్లెంట్లను పోస్ట్ చేశారు. వాటిలో కార్పొరేషన్ అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించినవి 12,646. సమయం తరువాత పరిష్కరించినవి 5420ని పరిష్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆన్‌లైన్‌లో సేవలు పొందిన వారిలో ఎక్కువ మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 1757 మంది నగరంలో ఓటింగ్‌లో పాల్గొనగా 1652 మంది ప్రజలు నగరపాలక సంస్థ పనితీరును మెచ్చుకున్నారు. 90 మంది పర్వాలేదని ఓటింగ్ వేశారు. 300 శాతం మంది ఆన్‌లైన్ యాప్ డౌన్‌లోడ్, సిటిజన్ బడ్డి ద్వారా ఫిర్యాదులు చేసిన ఓటింగ్ 9 శాతం మించకపోవడం కొంత ప్రతికూలం అని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకును మెరుగుపరుచుకోవడంలో ముందుండనుంది. అది ఫలితాలు వెలువడిన తరువాతనే ధ్రువీకరణ కానుంది.
Tags: Nizamabad Baldia in Top Ten

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *