ప్రాంతీయ బోర్డు ప్రకటన నిజామాబాద్‌ రైతుల విజయం: ధర్మపురి అర్వింద్‌

Date:04/02/2020

న్యూ డిల్లీ ముచ్చట్లు:

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలస్యం అయినప్పటికీ కేంద్రం తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ప్రకటించిన సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ప్రకటన రైతుల విజయం గా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూఈ బోర్డు ను సంక్రాంతి పండగ రోజునే ప్రకటించాల్సిందని , ‘పసుపు రైతుల దీర్ఘకాలిక స్వప్నంకంటే కేంద్రం ఎక్కువే ప్రకటించిందన్నారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పసుపు రైతులకు నా అభినందనలు. బోర్డులు విఫలమవ్వడానికి అనేక కారణాలున్నాయి. బోర్డులకు శాఖలతో సమన్వయం చేసుకునే అవకాశం లేదు. పసుపు అమ్మకం, కొనుగోలుదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించాలి. పసుపు అనేది ప్రాంతీయంగా పండే పంట. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వం ప్రపోసల్‌ పంపితే ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఎంపీ అర్వింద్‌ తెలిపారు.

ఓడిపోయిన అభ్యర్థులు అధైర్య పడవద్దు.. రాబోయే కాలం బిజెపిదే!

Tags: Nizamabad Farmers’ Success: Dharmapuri Arvind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *