దుబ్బాక‌లో నిజామాబాద్ వ్యూహాం

Date:11/09/2020

నిజామాబాద్ ముచ్చట్లు:

దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్‌ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్‌ అయితే అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెక్‌ చెప్పవ్చని భావిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఇతర పార్టీలు కూడా స్థానికులతో బల్క్‌ నామినేషన్లు వేయించేందుకు సిద్ధపడుతున్నాయని అంటున్నారు.నియోజకవర్గంలో చేనేత కార్మికుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలను ఇంతవరకూ ప్రభుత్వం పరిష్కరించలేదనే విషయాన్ని చేనేత కార్మికులకు గుర్తు చేసి వారితో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించాలని పార్టీలు భావిస్తున్నాయి.నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కూడా పసుపు రైతుల సమస్యలపై ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి.

 

అక్కడ పెద్ద ఎత్తున స్థానిక పసుపు రైతులతో నామినేషన్లు వేయించడం ద్వారా అప్పటి సిటింగ్‌ ఎంపీ కవితను ఓడించగలిగారని భావిస్తున్నాయి. అదే ప్లాన్‌ను దుబ్బాకలో కూడా అమలు చేస్తే వర్కవుట్‌ అవుతుందని అంచనా వేస్తున్నాయి.ఇదే సమయంలో నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న మల్లన్న సాగర్ నిర్వాసితులు గతంలో చేసిన పోరాటాన్ని కూడా ఎన్నికల్లో వాడుకునే ప్లాన్‌లో ప్రతిపక్షాలు ఉన్నాయంటున్నారు. దుబ్బాక ప్రాంతంలో నిర్వాసితులకు తక్కువ పరిహారం ఇచ్చారని గుర్తు చేసి వారితో కూడా నామినేషన్లు వేయించాలని భావిస్తున్నాయట.సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో నిర్వాసితులకు ఎక్కువ పరిహారం ఇచ్చి, దుబ్బాకలో మాత్రం తక్కువ ఇచ్చారని ప్రచారం చేయడం ద్వారా స్థానికుల్లో అగ్గిని రాజేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని చెబుతున్నారు. తద్వారా నిర్వాసితులతో కూడా మూకుమ్మడి నామినేషన్లు వేయిస్తే టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టొచ్చని అంచనా వేస్తున్నాయి.మల్లన్న సాగర్ విషయంలో గతంలోనూ విపక్షాలు క్రీయాశీలకంగా వ్యవహరించాయి. ఆ పరిచయాలను వాడుకుని ఇప్పుడు లబ్ది పొందాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. అధికార టీఆర్ఎస్‌ జోరుకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన వ్యూహమని ఫైనల్‌ డెసిషన్‌కు వచ్చాయట. మరి నిజామాబాద్‌ ప్లాన్‌ దుబ్బాకలో ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలని జనాలు అంటున్నారు.

 

పులస చేపల విక్రయాలు జోరు

Tags:Nizamabad strategy in Dubbo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *