లారీని ఢీకొన్న ఇన్నోవా..ముగ్గురు మృతి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దేవోలు క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో నెలల చిన్నారి వుంది. ముందు వెళ్తున్న లారీని ఇన్నోవా కారు వెనకనుంచి ఢీకొట్టింది. ఇన్నోవా చెన్నై వైపు వెళుతోంది. మృతులంతా అక్కడికక్కడే మరణించారు. ఘటనలో ఇన్నోవా నుజ్జు నుజ్జు అయింది. మృతుల వివరాలు తెలియాల్సి వుంది.
Tags: nnova collided with a lorry, three killed

