అమలాపురం అల్లర్ల కేసులో ఆధారం లేకపోతే అరెస్ట్ చేయం…
అనుమానత నిందితులకు ఎస్పీ భరోసా…
తాజా గా నలుగురు అరెస్ట్
ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి
అమలాపురం ముచ్చట్లు:
అల్లర్లు కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో గున్నబత్తుల అనిల్, వీరమళ్ళు తూము శశి కుమార్, కడలి ప్రసాద్, గుర్రాల జగన్మోహన్ సత్య సాయి లు వున్నారు. పక్కా ఆధారాలతోనే నిందితులు గుర్తిస్తున్నామని ఆయన తెలిపారు. ఆధారాలు లేని వ్యక్తులు అవసరం లేదన్నారు. ప్రస్తుతం వున్న అనుమానితుల్లో ఎవరైయినా సంఘటనల్లో ప్రత్యక్షంగా లేక పొతే వెరిఫై చేస్తామని ఆకారణంగా ఎవర్ని కేసుల్లో పెట్టమని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. విధ్వంసం లో పాల్గొన్న కొంతమంది యువకుల వీడియో లను పాత్రికేయు ల ముందు ప్రదర్శించారు. కొంత మంది ఫేస్ బుక్ లోను, వాట్సాప్ లోను రెచ్చ గొట్టే పోస్టింగ్ లు పెడుతున్నారని వారిని తాము గుర్తిస్తున్నమ్మన్నారు. చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పాత్రికేయులు సమావేశంలో ఎస్పీ మాధవిలత, డిఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు.
Tags: No arrest if there is no evidence in the Amalapuram riots case…