Natyam ad

కార్డులు కాదు…అంతా డిజిటలే

విజయవాడ ముచ్చట్లు:


ఏపీ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లైసెన్స్, ఆర్సీ కార్డులు కార్డులు జారీ చేయమని తెలిపింది. వాహన తనిఖీ సమయాల్లో డిజిటల్ పత్రాలు చూపిస్తే సరిపోతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఇకపై డ్రైవింగ్ లైలెన్సులు, ఆర్టీసీ కార్డులు ఉండవు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖకు సంబంధించిన యాప్ లో పత్రాలు డౌన్ లోడ్ చేసుకుంటే సరి పోతుందని, ఇకపై కార్డులు జారీచేయమని ఈ శాఖ కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకూ లైసెన్సులు, ఆర్సీలను కార్డుల రూపంలో ఇస్తుంది రవాణా శాఖ ఇందుకోసం పోస్టల్ సర్వీస్ తో కలిసి రూ.225 వసూలు చేసేది. అయితే ఇప్పుడు ఈ ఛార్జీలు వసూలు చేయడంలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి త్వరలో కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం “వాహన్‌ పరివార్‌” పేరు సేవలన్నీ ఆన్‌లైన్‌ చేసింది. దీంతో చాలా రాష్ట్రాలు కార్డులను తొలగించి డిజిటల్‌ రూపంలోనే పత్రాలు జారీ చేస్తున్నాయి. ఈ విధానాన్నే ఏపీ రవాణాశాఖ కూడా అమల్లోకి తెచ్చింది.రవాణాశాఖ వెబ్‌సైట్‌ https://aprtacitizen.epragathi.org లోని ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్‌ చేసుకొని సర్టిఫికెట్ ను తీసుకోవాలి. లేదా “aprtacitizen” ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాహన తనిఖీ సమయంలో పోలీసు, రవాణాశాఖ అధికారులకు ఈ పత్రాలు చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ పత్రాలను అనుమతించాలని పోలీసు, రవాణా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ కార్డులను నిలిపివేయాలని డిజిటల్‌గా మార్చాలని ఏపీ రవాణా శాఖ నిర్ణయించింది. సీఎం జగన్ ఆదేశాలతో పేపర్‌లెస్ ప్రక్రియలో భాగంగా రవాణాశాఖ డిపార్ట్‌మెంట్ పత్రాలను డిజిటల్ వెర్షన్‌తో భర్తీ చేయనుంది.

 

 

 

కార్డుల దరఖాస్తు రుసుము రూ. 200, పోస్టల్ ఛార్జీలు రూ. 25 ఇకపై వసూలు చేయమని ప్రకటించింది. డిజిటల్ కార్డులు డిజిలాకర్ లేదా పరివాహన్‌ సేవ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్లు ఉపయోగించని వారు డిజిటల్ కార్డులను ప్రింట్ అవుట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవచ్చని రవాణాశాఖ కమిషనర్ పేర్కొన్నారుఇకపై ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను క్యారీ చేయక్కర్లేదని, పేపర్ డ్రైవింగ్ లైసెన్స్ లు, పేపర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లకు ప్లాస్టిక్ కార్డులుండవని రవాణా శాఖ తెలిపింది. పేపర్ లెస్ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్ లు, డిజిటల్ ఆర్సీ కార్డులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధానానికి ఏపీ రవాణా శాఖ కూడా అనుమతితెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికి డిజిటల్ కార్డుల జారీ విధానాన్ని అమలుచేస్తుంది. డిజిటలైజేషన్ లో భాగంగా ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆ కార్డుల కొరతతో ఏడాదిగా పెండింగ్ లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీ కార్డుల ప్రింటింగ్ కు ప్రభుత్వం ఇటీవల రూ.33.39 కోట్లు మంజూరు చేసింది.

 

 

 

Post Midle


డిజిటల్ కార్డుల వెనుక…
ఏపీలో వాహనదారులకు ఇకపై రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇకపై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ఆపేసింది. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదు. ఇకపై వాహనదారులు తమ మొబైల్స్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీని పోలీసులు, రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది. ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. లావాదేవీలతో పాటు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని.. అందుకే భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకువచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. వాహనదారులంతా మొబైల్‌లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్‌ ద్వారా లైసెన్స్, ఆర్సీలను డౌన్‌లోడ్‌ చేసుకోని పెట్టుకొని అవసరమైనపుడు చూపిస్తే సరిపోతుందని ప్రకటించారు.

 

 

 

అయితే, ఈ డిజిటలైజ్ చేయడం వెనక పెద్ద తతంగమే నడిచిందని ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుండి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీఏ సర్వీసుల డిజిటలైజేష్ ప్రజలకు వెసులుబాటు కోసం చేసింది కాదనీ,   లైసెన్సులు, ఆర్సీలకు కావాల్సిన ముడి సరుకు కొరతతోనే ఇందుకు ఉపక్రమించిందని అంటున్నారు. మొన్నటి వరకు లైసెన్సులు, ఆర్సీల కోసం వాహనదారుల నుండి కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇలా ఏడాది కాలంగా డబ్బులు చెల్లించిన ఎవరికీ ఈ కార్డులు పంపించలేదు. గత ఏడాది కాలంగా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో పంపిణీ చేయడానికి వాహనదారుల నుండి డబ్బులు తీసుకున్నారు కానీ, ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో డబ్బులు కట్టకపోవడంతో కార్డులు పంపాల్సిన వెండర్లు రవాణాశాఖకు పంపించలేదు. అప్పటికే పెండింగ్ బిల్లులు ఉండగా.. అవి క్లియర్ చేస్తేనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం ఈ డిజిటల్ ఆలోచన చేసిందని చెబుతున్నారు. ఇకపై ఈ కార్డుల కోసం చెల్లించాల్సిన రూ.225 అవసరం లేదని చెప్తున్న రవాణా శాఖ.. గత ఏడాది కాలంగా ఈ డబ్బు చెల్లించిన వారికి కార్దులు పంపిస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే, ఇక కార్దుల ఆశ వదులుకోవాల్సిందేనని ఆర్టీఏ ఏజెంట్లు చెప్తున్నారు.

 

Tags: No cards…all digital

Post Midle