Natyam ad

లాస్ట్ చాన్స్ అనే వారికి నోచాన్స్ – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

నాకు లాస్ట్ చా న్స్ …. ఒక్కచాన్స్ ఇవ్వండి… అనే వారికి ప్రజలు ఎటువంటి చాన్స్ ఇవ్వరని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం మున్సిపాలిటిలోని చింతలవీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప , జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. మంత్రి పెద్దిరెడ్డి జగనన్న సంక్షేమబావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు.మంత్రి లభ్ధిదారులను సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? ఈ పథకాలు అందించింది ఎవరో తెలుసా అంటు సరదాగా మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ప్రతి ఒక్కరిని లక్షాధికారులుగా చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి, ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు రెడ్డెమ్మ, కొండవీటి కాంతమ్మ, కొండవీటి గంగులమ్మ, రేష్మా, పూలత్యాగరాజు, కమలమ్మ, భారతి, సాజిదా, అమ్ము, కిజర్‌ఖాన్‌, కాళిదాసు, నరసింహులు, జెపి.యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: No chance for those who are last chance – Minister Peddireddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.