శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీ వద్దు-డిఐజి

ఆత్మకూరు ముచ్చట్లు:శాంతిభద్రతల పరివేక్షణలపై పోలీసులు రాజీ లేకుండా పని చేయాలని కర్నూల్ రేంజ్ డీఐజీ  సెంథిల్ కుమార్, సూచించారు. ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ప్రాగణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు .అనంతరం ఆయన ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను.   త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో, షాపింగ్ మాల్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా అక్రమ మద్యం అమ్మకాలను పూర్తిగా అరికట్టాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సంబంధిత అధికారుల అనుమతుల మేరకు డిస్పోజెల్ చేయాలని. తెలిపారు గ్రామ వార్డు మహిళా పోలీసులతో సమీక్షించి గ్రామంలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలన్నారు. డిఐజి తో పాటు ఎస్పీ రఘువీర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, విజయ భాస్కర్, సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు కృష్ణమూర్తి ,హుస్సేన్ భాష ఉన్నారు.

 

Tags: No compromise on law and order supervision-DIG

Leave A Reply

Your email address will not be published.