మొదటి సారిగా నో కాంగ్రెస్

Date:27/06/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగై పోయింది. కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టింది. గతంలో రాజ్యసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కి ఖచ్చితంగా కొన్ని స్థానాలు దక్కేవి. శాసనసభలో సభ్యుల బలం ఉండటంతో రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం ఉండేది.ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి రాజ్యసభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరూ ఎన్నిక కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉంది. అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండేది. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీనమయిపోయింది.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ వీక్ అయింది.

 

 

 

 

 

సరైన నాయకత్వం లేకపోవడం, తెలంగాణ రాష్ట్రం తామే ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేకపోయింది. రెండు స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అధికార టీఆర్ఎస్ కే దక్కాయి. శాసనసభ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేకపోవడం, ఉన్న ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే 2014, 2019 ఎన్నికల్లో బోణీ చేయలేదు. అసెంబ్లీలో కూడా దానికి ప్రాతినిధ్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాజ్యసభ స్థానాలు దక్కకుండా పోయాయి. ఉన్న సీట్లు, ఓట్లు వైసీపీ పట్టుకుపోవడంతో కాంగ్రెస్ ఏపీలో నామమాత్రంగా తయారయింది. గతంలో రాజ్యసభ ఎన్నికలు వస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ లాబీయింగ్ తో నడిచిపోయే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇక నాలుగేళ్లలో రాజ్యసభ స్థానాలు ఈ రెండు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం లేదు.

మళ్లీ కుయ్..కుయ్ అంటూ 108

 

Tags:No Congress for the first time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *