నామినేషన్ పత్రాలు అందించే దిక్కులేదు..

-నామినేషన్ స్వీకరించే నాధుడు లేడు
-బిఎన్ కండ్రిగలో తేదేపా నిరసన

Date:25/01/2021

చిత్తూరు  ముచ్చట్లు:

రాష్ట్ర ఎలక్షన్ కమీన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు నేటి నుంచి మొదటి విడుత నామిషనేషన్ ప్రక్రియ మొదలుకానున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపధ్యంలో ఎన్నికలు ఇప్పుడు జరుపలేమని ప్రభుత్వం ఎన్నికల కమీషన్ కు తెలిపింది. అయినప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు ఖరారయ్యాయి.ఎక్కడా కూడా అందుకు సంబందించిన ఏర్పాట్లు కనపడటం లేదు.చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో తొలివిడుత నామినేషన్ లను దాఖలు చేయడానికి తెదేపా సత్యవేడు ఇన్ ఛార్జ్ జేడి రాజశేఖర్ తమ అభ్యర్ధులను వెంటబెట్టుకుని కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని యంపిడివో రవికుమార్ తెలపడంతో తేదేపా నిరసనకు దిగింది. పార్టీలకు సంబంధం లేని ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం అడ్డుపడటం రాజ్యాంగ విరుద్ధమని జేడి రాజశేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగ కూనీకి పాల్పడుతుందని ఆరోపించారు. సంబంధిత కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు అందించేందుకు గానీ ,స్వీకరించేందుకు గానీ అధికారులు లేక పోవడంతో చేసేది ఏమిలేక నిరసన వ్యక్తం చేసి వెనుతిరిగారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags:No direction to provide nomination papers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *