Natyam ad

చదువు లేకుంటే అంధకారమే -డీవైఈవో పురుషోత్తం

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు లభిస్తుందని లేదంటే జీవితం అంధకారంగా మారిపోతుందని డిప్యూటి డీవైఈవో పురుషోత్తం సూచించారు. బుధవారం మండలంలోని గూడూరుపల్లె జెడ్పి హైస్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం, ఆంగ్లబోదనపై విద్యార్థుల పరిజ్ఞానం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీవైఈవో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 5 అంశాలను పాటించాలన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, తపన, పట్టుదల, ఓపిక ఉండాలన్నారు. వీటి ద్వారా దేనినైనా సాధించేందుకు వీలుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈయన వెంట ఎంఈవో రెడ్డెన్నశెట్టి, ఉపాధ్యాయులు రాజేష్‌, రఘు, నరసింహులు, భారతి, మునిరాజ, విజయవాణి, శైలజరాణి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: No education is darkness – DYEO Purushottam

Post Midle