అమరావతి ముచ్చట్లు:
టిడిపి అధికారంలోకి వచ్చిందనివాళ్ల సొంత లాభాల కోసం వైసిపిని వీడినట్లు షో చేస్తూ టిడిపిలోకి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారు .చిన్న చిన్న నామినేటెడ్ పదవులు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల లాంటి వాటికోసం గానీ నీటిపారుదల సంఘాల అధ్యక్ష పదవుల కోసం గానీ ఇతరత్రా పదవులకోసం గానీ, లోగడ తప్పులు చేసి వాటినుండి తప్పించుకోవడానికి గానీ పార్టీలోకి చేరి మరల వారు ఈ పదవులు పొంది తిరిగి ఆ పార్టీ వారికి అనుకూలంగా ఉంటారని, అటువంటి వారి ఎత్తుగడలు చెల్లవని తేల్చి చెప్పారు.అటువంటి వారిని
పార్టీలోకి చేర్చుకోవద్దని కార్యకర్తలను నాయకులను ఆదేశించారునిజాయితీగా పార్టీలో తిరిగేవారికే పదవులు గాని నాయకత్వం గానీవస్తుందని రెండు పడవలపై కాలు వేసే వారిని దూరంగా ఉంచాలని,టిడిపిలో ఉంటూ వైసీపీ కోవర్ట్ లుగా పనిచేసే వారిని గుర్తించివారిని దూరం పెట్టాలని ఆదేశించారు .
Tags: No entry of YCP leaders and workers into TDP party has been ordered by the CM.