పోలాలగుండా గ్యాస్ పైప్ లైన్లు వద్దు
నరసాపురం ముచ్చట్లు:
రైతులతో చర్చించకుండా ఓఎన్జిసి పొలాల గుండా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడితే తీవ్ర పరిణామాలు తప్పవని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో గుర్తించిన గ్యాస్ నిక్షేపాల తరలింపులో గత రెండు రోజులుగా వైయస్ పాలెం , రుస్తుం బాధ, సీతారాంపురం గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొలాల గుండా పైప్ లైన్ పనులు చేపడితే భూములను అమ్ముకోవడానికి వీలుండదన్న ఆందోళనతో రైతు మారబోయిన సత్యనారాయణ ఈరోజు ఉదయం గుండె ఫోటుతో మృతి చెందారు. దీంతో రైతులు చేపడుతున్న ఆందోళన మాజీ మంత్రి కొత్తపల్లి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ చాగంటి చిన్నాలు వైయస్ పాలెం గ్రామాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులతో చర్చించిన తర్వాతే పనులు చేపట్టాలని మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు జనసేన నాయకులు నాయకర్ చిన్నాలు డిమాండ్ చేశారు

Tags;No gas pipe lines across the fields
