పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించే ఆలోచన లేదు: కేంద్రం

No idea of cutting excise duty on petrol and diesel: Center

No idea of cutting excise duty on petrol and diesel: Center

Date:24/04/2018
న్యూఢిల్లీ ముచట్లు:
పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసేసింది. దీనికి బదులు రాష్ట్రాలే అమ్మకం పన్నో లేదా వ్యాటో తగ్గించుకోవాలని సూచించింది. గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా పెట్రోల్‌ ధర- లీటరుకు 75-80 రూపాయలు, డీజిల్‌ ధర 66-72 రూపాయలకు పెరగడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్‌ లోటు తగ్గించుకోవాలంటే-ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించలేమని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.19.48డీజిల్‌పై లీటరుకు రూ.15.33 ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. సుంకం రూపాయి తగ్గిస్తే ప్రభుత్వంపై రూ.13,000 కోట్ల భారం పడుతుందని, ద్రవ్యలోటును జీడీపీలో 3,5నుంచి 3.3శాతానికి తగ్గించాలన్న ప్రయత్నాలు దెబ్బతింటాయని ఆ అధికారి వివరించారు. దీనితో పెట్రో ధరల పెరుగుదల నుంచి సామాన్యుఢికి ఉపశమనం దొరికిలా లేదు.
Tags:No idea of cutting excise duty on petrol and diesel: Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *