పెన్షన్ పై ఆదాయపు పన్ను వద్దు..

-ఆందోళనలో రిటైర్డ్ ఉద్యోగులు
-జీవన భృతిపై పన్ను వసూళ్లు వద్దు
-జగిత్యాల జిల్లా పెన్షనర్ల అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

Date:16/01/2021

జగిత్యాల ముచ్చట్లు:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు.    ఈ క్రమంలో    2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో పెన్షన్ దారులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని డిమాండ్ తో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు గత  మళ్ళీ ప్రారంభించారు.గత మూడేళ్ళుగా జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు  రాష్ట్ర వ్యాప్తంగా  జిల్లాల్లో ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్లలో స్పందన వచ్చింది.గత సంవత్సరం జిల్లాలో పోస్టు కార్డుల ద్వారా  కేంద్ర ఆర్ధికమంత్రి కి వినతులు పంపారు.ఈ ఏడు తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను  మాకు ఇస్తున్న గౌరవ భృతిపై ఆదాయపన్ను తగదు,మినహాయించాలి అంటూ  హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో    వినతులు  చేస్తున్నారు .  జగిత్యాల జిల్లాలో 8886  రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అధికారులు ,3849 మంది కుటుంబ పెన్షనర్స్,రాష్ట్రంలో,2.86 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు.ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ దారులకు వచ్చే పెన్షన్ ను0చి ఆదాయపు పన్ను వసూళ్లు కొనసాగుతున్నాయి.ప్రతి ఏటా ట్రెజరీ శాఖ ద్వారా,ఆన్ లైన్ ద్వారా అదాయపు పన్ను రిటర్న్ లు  సమర్పిస్తున్నారు.

 

 

 

ఈ విధానం సరికాదని,రిటైర్ ఆయిన పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని పెన్షనర్ల జేఏసి సంఘాలు కోరుతున్నాయి.తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల నర్సయ్య ద్వారా  సీ ఎం.కేసీఆర్ ను  కోరుతూ రాష్ట్రం తరపున ప్రతిపాదనలు పంపాలని కోరారు.జనవరి చివరి వారంలో ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోదీని ,కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను ,ఇతర ఎంపిలను,మంత్రులను కలవాలని నిర్ణయించారు. జిల్లాలోని పెన్షన్ దారులకు,సంఘాలకు  వాట్సాప్,ఫేస్ బుక్ ల ,తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను పంపుతూ జిల్లా డివిజన్, మండలాల్లో పెన్షన్ పై ఆదాయపు పన్ను రద్దు చేయాలని కోరుతూ హరి అశోక్ కుమార్  ఉమ్మడి జిల్లాల్లోసదస్సులు నిర్వహిస్తున్నారు.                   -ఇతర డిమాండ్లపై సైతం ఆందోళన: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే  తెలంగాణ లో పెన్షనర్స్ కు  తెలంగాణ ప్రోచ్చాహకం ఇవ్వాలని,70 ఏళ్ల కే క్వాంటం పెన్షన్ ప్రకటించాలని,రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 50 శాతం రాయితీ కల్పించాలని,మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని,గ్రంధాలయ ,వ్యవసాయ మార్కెట్ కమిటీ ,సింగరేణి కాలరీస్,దేవాదాయశాఖ  పెన్షనర్స్ కు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని,ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కు,జర్నలిస్టుల  కు నగదు రహిత వైద్య సేవల కోసం వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సదస్సులు నిర్వహిస్తున్నారు.       -పెన్షన్ దారులను  ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలి . హరి అశోక్ కుమార్,జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్.జగిత్యాల జిల్లా.

 

 

 

ఏదయినా సర్వీస్ చేసినందుకు విధులు నిర్వహిస్తూ పొందే ఆదాయం పై పన్ను విధించడం సబబే.కానీ రిటైర్డ్ ఉద్యోగుల కు ఇచ్చే  గౌరవ జీవనభృతి పెన్షన్,దానిపై  ఆదాయపు పన్ను వసూలు చేయడం సరికాదు.కేంద్రం పెన్షనర్ల్అందరికీ ప్రయోజనకరంగా జాతీయ పెన్షన్ పాలసీని రూపొందించాలి.సీ పి ఎస్  (కాంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీం) ను రద్దు చేయాలి.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:No income tax on pension.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *