మాస్క్ లేనిదే – ప్రవేశం లేదు

ఆదోని ముచ్చట్లు:
మున్సిపల్ కార్యాలయం నుండి బీమా సర్కిల్ వరకు  మాస్క్ ధరించకపోతే వాహనాల్లో ప్రయాణం లేదు అనే కార్యక్రమం ద్వారా   మంగళవారం ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మాస్క్ ధరించకపోతే వాహనాలు నడపరాదు అన్నారు. బస్సుల్లో, ఆటోలో ఇతర వాహనాల్లో మాస్క్ ధరించకపోతే ప్రయాణికులుకు అనుమతి లేదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ చేతులు సబ్బుతో/శానిటైజర్ కడుక్కుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కొంతమంది వాహనదారులు మాస్క్ లేకుండగా ప్రయాణం చేస్తున్న వారికి స్వయంగా ఆర్డీవో వారికి మాస్కు ధరించి మాస్క్ యొక్క ప్రయోజనాల గురించి వివరించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, ట్రాఫిక్ సీఐ లక్ష్మయ్య, డిప్యూటీ తాసిల్దార్ రజినికాంత్ రెడ్డి. మున్సిపల్ , పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags:No mask – no entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *