Natyam ad

పుంగనూరులో మాస్క్ లు లేకుంటే అనుమంతించం

పుంగనూరు ముచ్చట్లు:
 
కరోనా నియంత్రణలో భాగంగా పట్టణ ప్రజలు , పట్టణానికి వచ్చిపోయే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి తీరాలని ,  మాస్క్ లు లేకపోతే పట్టణంలో అనుమతించబోమని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటిలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌, జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి కోవిడ్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు నోమాస్క్…నో ఎంట్రి విధానాన్ని అమలుపరుస్తామన్నారు. మున్సిపల్‌ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులతో కలసి తనిఖీలు నిర్వహించి, మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించని వారికి జరిమాన విధిస్తామన్నారు. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని , లేకపోతే భారిమూల్యం చెల్లించకతప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
 
మండలంలో…
కరోనా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కోవిడ్‌ నియంత్రణపై ఎంపీడీవో లక్ష్మీపతి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌తో కలసి సమావేశం నిర్వహించారు. ఎంపిపి మాట్లాడుతూ కరోనా రెండవ వేవ్‌లో అధిక సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలసి ఆక్సిజన్‌ప్లాంటు ఏర్పాటుతో పాటు 80 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పువాటిళ్లకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: No masks allowed in Punganur – Chairman Aleem Basha