ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదురైన రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపలేరు- ఎంపీ మిథున్ రెడ్డి

సోమల ముచ్చట్లు:

 

మండలంలోని ఆవులపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన మూడు టీఎంసీల రిజర్వాయర్ పనులను చంద్రబాబు ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేడని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన సోమల బస్టాండ్ వద్ద 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించతలపెట్టిన బస్ షెల్టర్ నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆవులపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు రిజర్వాయర్ పనులను అడ్డుకునేందుకు NGT( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఫిర్యాదు చేసి రిజర్వాయర్ ను నిలుపుదల చేయాలని ప్రయత్నిస్తున్నారని అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని మండలంలోని చెరువులను అభివృద్ధి పరిచేందుకు ఏడాదికి మూడు పంటలు రైతులు పండించుకునేందుకు సదుం ,పులిచెర్ల మండలాల రైతులకు కూడా రిజర్వాయర్ నీటిని అందజేసేందుకు ఎంతో ముందస్తు ఆలోచనతో రిజర్వాయర్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. హంద్రీనీవా కాలువ పుంగనూరు నుండి సోమల వరకు తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని చెరువులకు కాలువల ద్వారా నీటిని నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

 

 

 

ఆవుల పల్లె వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ వల్ల భూముల విలువ పెరుగుతుందని ఇదే సందర్భంలో రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని ఈ విషయంలో రైతులు ఎలాంటి సందేహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నాటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి చేసి చూపించలేదని తాము అధికారంలోకి వచ్చాక కడప జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తూ వస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ వారికి అభివృద్ధి చేసి చూపడం చేతకాదు కాని మంజూరైన పనులను అడ్డుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా చర్యలు తీసుకునేందుకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేయాలనదే లక్ష్యమని ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.కార్యక్రమంలో చిత్తూరు ఎంపి రెడ్డప్ప,వైసిపి కార్యదర్శి పెద్దిరెడ్డి, సిడిసియంఎస్ చైర్మన్ సహదేవరెడ్డి,పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, అక్కిసాని బాస్కర్ రెడ్డి, నాగరాజారెడ్డి, మిద్దింటి శంకరనారాయణ పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: No matter how many obstacles are created, the construction of the reservoir cannot be stopped- MP Mithun Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *