ప్లయిట్ లలో మధ్య సీట్ల బుకింగ్ నో

Date:25/05/2020

ముంబై ముచ్చట్లు:

భౌతికదూరం నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 6 వరకు మధ్య సీట్ల బుకింగ్‌తో షెడ్యూల్ కాని విదేశీ విమానాలను నడపడానికి ఎయిర్ ఇండియాకు అనుమతి ఇచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్ ఇండియా ఈ విషయమై నిబంధనలలో మార్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచించారు. బాంబే హైకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం,ఎయిరిండియా సుప్రీంకోర్టు ఆశ్రయించగా.. మధ్య సీటు బుకింగ్‌తో పది రోజుల పాటు విదేశీ సర్వీసులకు అనుమతించింది.ఈ అంశంపై మరోసారి బొంబాయి హైకోర్టును సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అంత వరకూ దీనిని పెండింగ్‌లో ఉంచుతున్నట్టు జస్టిస్ బాబ్డే తెలిపారు. కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. బొంబాయి హైకోర్టు వెలువరించి ఉత్తర్వులు కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తాయని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్లూ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్వారంటైన్ తప్పనిసరని వివరించారు.

 

 

ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. అంతర్జాతీయ, దేశీయ విమానాల మధ్య ఎలాంటి తేడా ఉండదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ప్రస్తుత సమయంలో కనీస ఇంగిత జ్ఞానంతో భౌతికదూరం పాటించడం చాలా ముఖ్యమని, వాస్తవం ఏంటంటే సెంట్రల్ సీటును ఖాళీగా ఉంచమని మాత్రమే చెప్పారని, వారిని తీసుకురాకుండా మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదని ఘాటుగా స్పందించారు.దీనిపై సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. ఇది నిపుణులు తీసుకున్న నిర్ణయమని, విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించడానికి పెద్ద సంఖ్యలో విమానాలు లేవని అన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. పక్క పక్కనే కూర్చుంటే వైరస్ వ్యాప్తి చెందుతుందని, తాము పౌరుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నామని మండిపడింది. ఈ అంశంపై బాంబే హైకోర్టును మరోసారి సంప్రదించి, విచారణ అనంతరం మధ్యంతర ఉత్తర్వులను జారీచేస్తామని స్పష్టం చేసింది. ఈ అంశంపై జూన్ 2న విచారణ చేపట్టే వీలుంది.

ఎగిరిన విమానాలు.

Tags: No mid-seat booking on plates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *