Natyam ad

నాటి ఏలికలు బరిలో లేరిక!

-తంబళ్లపల్లెను శాసించిన తొలితరం టీఎన్‌ కుటుంబం
-పోటీగా సత్తా చాటిన కలిచర్ల, అనిపిరెడ్డి కుటుంబాలు
-పోరాటాలతో ఒంటరిగా ఎదిగిన చల్లపల్లె
-ఒకరి తర్వాత ఒకరుగా రాజకీయాల నుంచి నిష్క్రమణ
-సంచలనం రేపిన శంకర్‌ ప్రత్యక్షానికి దూరం

తంబళ్లపల్లె ముచ్చట్లు:

Post Midle

స్వాతంత్య్ర అనంతరం తంబళ్లపల్లె నియోజకవర్గ రాజకీయ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. తంబళ్లపల్లె అంటే టీఎన్‌ కుటుంబం అన్నంతగా పేరు. సౌమ్యులుగా, దానధర్మాల్లో వారికి మించిన వారు లేరన్నంత పేరున్న ఈ కుటుంబం రాజకీయాలను శాసించింది. అధికారం కోసం కలిచర్ల కుటుంబం నుంచి రాజకీయాలు వెహోదలవగా అధికారం చేతులు మారుతూ వచ్చింది. టీఎన్‌ కుటుంబం ఒకదశలో రాజకీయాలకు గుడ్‌బై చెప్పగా ఆ స్థానాన్ని కలిచర్ల కుటుంబం భర్తీ చేసింది. టిఎన్‌ కుటుంబ స్థానాన్ని కలిచర్లకు పోటీగా అనిపిరెడ్డి కుటుంబం క్రీయాశీలమైంది. ఈ రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా చల్లపల్లె నరసింహారెడ్డి ఒంటరి పోరాటమే చేసింది. టీఎన్‌, కలిచర్ల, అనిపిరెడ్డి, చల్లపల్లె కుటుంబ్చా తో జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీల్లో కొనసాగుతూ సాగించిన రాజకీయాలతో వారికి ఆయా పార్టీలో ప్రత్యేకస్థానం దక్కింది. ఒంటిచేత్తో, కంటిచూపుతో రాజకీయాలను శాసించిన నేతలు ఏలిన ప్రాంతమిది. వర్గపోరు, అధికారం కోసం కష్టించి పనిచేసిన నేతలకు ఇది పుట్టినిల్లు. టీఎన్‌, కలిచర్ల కుటుంబాలు ఆదినుంచే పేరున్నవే. వీరితో పోటీపడుతూ సాధారణ కుటుంబాలకు చెందిన అనిపిరెడ్డి, చల్లపల్లె కుటుంబాలు రాజకీయంగా ఎదగడానికి పడినశ్రమ అసాధాణమైనది. ఈ వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో గ్రామాలు బాధితులయ్యాయి. ఈ నాలుగు కుటుంబాల్లో చల్లపల్లె కుటుంబ మాత్రమే అధికార పదవికి దూరంగా ఉండిపోయింది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ కీలకపాత్ర వహించడ మే కాదు శాసనసభకు పోటీచేసే ఈ కుటుంబాలు మారిన రాజకీయ పరిస్థితులతో ప్రత్యక్ష పోరాటానికి దూరమయ్యారు.

 

 

టీఎన్‌, కలిచర్ల కుటుంబాల పోటీ….

1952 తొలి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తంబళ్లపల్లెకు చెందిన టీఎన్‌ కుటుంబానిదే హవా. నాలుగుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలవగా చివరగా ఒకసారి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన 1983 ఎన్నికల్లో గెలవడమే చివరి ఎన్నికయ్యింది. ఐదుసార్లు టీఎన్‌ కుటుంబానికి చెందిన టీఎన్‌.వెంకటసుబ్బారెడ్డి రెండుసార్లు, టీఎన్‌.అనసూయమ్మ రెండుసార్లు, టీఎన్‌.శ్రీనివాసులురెడ్డి ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యారు. మధ్యలో పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామానికి చెందిన కలిచర్ల నరసింహారెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. టీఎన్‌ కుటుంబానికి 1985 ఎన్నికలే చివరివి. నరసింహారెడ్డి అనంతరం ఆయన కుమారుడు కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా 1989లో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్‌ అనుబంధ సభ్యునిగా కొనసారు. 1994లో కాంగ్రెస్‌ నుంచి పోటిచేసి ఓడిపోగా 1999, 2004లో గెలిచారు. ఎమ్మెల్యేగా కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి ప్రాభవం చెప్పలేనిది. అధికార యంత్రాంగాన్ని, రాజకీయాలను కనుసైగతో శాసించారు. 2009లో కాంగ్రెస్‌ టీకెట్‌ దక్కపోవడంతో పీఆర్‌పీతో పోటీచేసి ఓటమిపాలైన ప్రభాకర్‌రెడ్డికి అవే చివరి ఎన్నికలయ్యాయి. 2014 ఎన్నికల్లో పోటీ చే యకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై వైఎస్‌ఆర్‌సీపీలో చేరి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల్లో కృషి చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి గెలుపుకు సహకరించారు. 2014, 2019 ఎన్నికలకు దూరమైన కలిచర్ల రెండేళ్ల క్రితం స్వర్గస్తులయ్యారు. దీనితో ఆ కుటుంబం నుంచి ప్రాతినిథ్యం లేక రాజకీయ చరిత్ర సమాప్తమైంది.

అనూహ్యంగా తెరపైకి అనిపిరెడ్డి…

ములకలచెరువు మండలం గూడుపల్లెకు చెందిన ఏవీ.ఉమాశంకర్‌రెడ్డి 1983లో టీడీపీలో చేరి టీడీపీ జిల్లా అధ్యక్షుడయ్యారు. అప్పట్లో బిటెక్‌ గోల్డ్మెడలిస్ట్ కావడం, రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఎన్టీఆర్‌ వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. టీఎన్‌, కలిచర్ల కుటుంబాలను ఎదురొడ్డి నిలబడం అంటేనే సాహసం. 1983లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోగా తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 1984లో ఆయన హత్యకు గురికావడంతో సతీమణీ అనిపిరెడ్డి వెంకట లక్ష్మీదేవమ్మ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సులువుగా గెలిచినా టీఎన్‌, కలిచర్ల కుటుంబాల మధ్య నిలదొక్కుకోవడం కోసం ఎంతో శ్రమించారు. ఒక సాధారణ మహిళగా లక్ష్మీదేవమ్మ బలమైన కుటుంబాల నడుమ రాజకీయాల్లో పట్టుసాధించారు. 1989 ఎన్నికల్లో లక్ష్మిదేవమ్మ ఓడిపోగా ఇండిపెండెట్‌గా పోటిచేసిన కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి అసెంబ్లీ పోటీ వీరిమధ్యనే సాగుతూ వచ్చింది. 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తుతో లక్ష్మీదేవమ్మకు టికెట్‌ దక్కలేదు. ఆమె బరిలో లేకపోవడంతో కలిచర్ల ప్రభాకర్‌ ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. వర్గం చేజారుతుందని 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన లక్ష్మీదేవమ్మను పార్టీనుంచి సస్పెండ్‌ చేశారు. అవే ఆమెకు చివరి ఎన్నికలయ్యాయి. 2009 ఎన్నికల్లో తన రాజకీయ వారసుడుగా తనయుడు ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టీడీపీ అభ్యర్థిగా పోటిచేయగా 15ఏళ్ల తర్వాత అనిపిరెడ్డి కుటుంబం నుంచి ప్రవీణ్‌ ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌పై పోటీచేసిన ప్రవీణ్‌ ఓడిపోగా రాజకీయాలకు దూరమయ్యాయి. దీనితో 2019 ఎన్నిక్చ నుంచి అనిపిరె డ్డి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైంది.

చల్లపల్లె ఒంటరి పోరాటం….

పెద్దమండ్యం మండలం మందలవారిపల్లెకు చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిది సాధారణ కుటుంబానికి చెందిన సాధారణ వ్యక్తి. మదనపల్లె బీటీకళాశ్చా లో చదువుతున్న సమయంలోనే క్రీయాశీల రాజకీయాలు నడిపారు. బీజేపీతో ప్రారంభించిన రాజకీయాలు ఆయన జీవితంతోనే చెలగాటమాడాయి. అప్పటికే బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన టీఎన్‌, కలిచర్ల, అనిపిరెడ్డి కుటుంబాలను ఢీకొంటూ పార్టీ కార్యక్రమాలతో ముందుకొచ్చారు. 1980లలో బీజేపీ అంటేనే తెలియని తంబళ్లపల్లె ప్రజలకు ఆ పార్టీ గురించి పరిచయం చేసి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సభలు నిర్వహించారు. కలిచర్ల, చల్లపల్లె మధ్య నెలకొన్న రాజకీయ వైర్యానికి కొన్ని ప్రాణాలు బలయ్యాయి. చల్లపల్లెపై హత్యాయత్నం జరగ్గా తృటిలో తప్పించుకున్నారు. లక్ష్మిదేవమ్మకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న ఆశయంతో జీవితమంతా తంబళ్లపల్లె రాజకీయాలకే కేటాయించారు. 2004లో ఎమ్మెల్యే అవకాశం 620 ఓట్లతో ఓటమిపాలవ్వడం ఆయనకు బాధ కలిగించింది. 1991లో రాజంపేట పార్లమెంటుకు పోటీచేయడంతో ప్రారంభించి చివరగా 2014 ఎన్నికల వరకు రాజకీయ ప్రస్థానం సాగించారు. 1991లో ఎంపీగా, 1994లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. రాజకీయంగా అనిపిరెడ్డి, కలిచర్ల కుటుంబాలకు పోటీగా నిలదొక్కుకునేందుకు కష్టపడ్డారు. ప్రధానంగా అనిపిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతియాలని వెంకయ్యనాయుడుతో ఉన్న సాన్నిహిత్యంతో బీజేపీ పోత్తుతో 1999, 2004లో తంబళ్లపల్లె స్థానం కేటాయించుకొన్నారు. దీనితో లక్ష్మీదేవమ్మ రాజకీయంగా ప్రజలకు దూరమవుతారని భావించారు. 1999 ఎన్నికల్లో గెలుపు సహకరించకపోగా 2004లో తనను ఓడించేందుకు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారని లక్ష్మీదేవమ్మపై చల్లపల్లె ఆరోపణలు చేశారు. 2009లో చల్లపల్లెలో మళ్లీ పోటీచేసి ఓడిపోగా బీజేపీతో మళ్లీ కుదిరిన పోత్తుతో ఆయన తంబళ్లపల్లెను వదిలి 2014లో మదనపల్లె నుంచి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో గెలుస్తారని ఆశించినా ఓటమితప్పలేదు. 6 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన చల్లపల్లె 2019 ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా ఉంటున్నారు.


సంచలనం..అంతలో నిష్క్రమణ…..

తంబళ్లపల్లె రాజకీయాల్లో ఎవరూ ఊహించని వ్యక్తి జి.శంకర్‌. పీటీఎం మండలం టీ.సదుంకు చెందిన ఆయన బెంగళూరులో రియల్టర్‌గా స్థిరపడ్డారు. బాగా సంపాదించడంతో ఎమ్మెల్యే కావాలన్న కోరికతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎంట్రీ ఓ సాహసం. కంటి చూపుతో రాజకీయాలను శాసించిన కలిచర్ల ప్రభాకర్‌రెడ్డిని కాదని శంకర్‌కు టీకెట్‌ తెచ్చుకున్నారు. టీఎన్‌, కలిచర్ల, అనిపిరెడ్డి కుటుంబాల నుంచి కాకుండా పోటీచేసిన తొలి వ్యక్తి శంకర్‌. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఏవీ. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికి, పీఆర్‌పీ నుంచి పోటీచేసిన కలిచర్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలయ్యాయి. కలిచర్ల మేనల్లుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కావడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తితో శంకర్‌ రాజకీయాలకు పూర్తిగా దూరయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తరపున బరిలో నిలవడంతో శంకర్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి 9,190 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఎన్‌, కలిచర్ల, అనిపిరెడ్డి కుటుంబాలకు చెందని వ్యక్తి, అందులో ఒక బీసీ ఎమ్మెల్యే కావడం చరిత్రగా మిగిలింది. అయితే ఈ విజయం శంకర్‌లో అతి విశ్వాసం పెంచింది. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కే పరిమితం కావ డం, పోటీఇచ్చే వాడేలేడన్న ధీమాతో రాజకీయంగా తప్పటడుగులు వేశారు. 2014లో 82,090 ఓట్లతో గెలిస్తే, రెండోసారి 2019 ఎన్నికల్లో పోటీచేస్తే 58,506 ఓట్లకే పరిమితం అయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీకి సిద్దమైన సమయంలో టికెట్‌ను మరోకరికి ప్రకటించడం, తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ టికెట్‌ ఇచ్చేందుకు సిద్దమైనప్పటికి మనస్థాపానికి గురైన శంకర్‌ పోటీ నుంచి విరమించుకున్నారు. ఎంత వేగంగా తంబళ్లపల్లె రాజకీయాల్లోకి వచ్చారో అంతే వేగంగా దూరమయ్యారు.

Tags: No more in the circle of the old crickets!

Post Midle