ఇక నో టీచర్ రిక్రూట్ మెంట్స్..?

విజయవాడ ముచ్చట్లు:

ల్ల‌లు చ‌దువు విష‌యంలో ఈ మ‌ధ్య‌ కాలంలో ఎన్నోర‌కాల మార్పులు వ‌చ్చాయి. వాటిలో విద్యతో పాటు పిల్లలలో మానసిక ఎదుగుదలకు, సచ్ఛీలతకు దోహదపడేవి ఎన్నంటే జవాబు మాత్రం వెంటనే దొరకదు. గ‌తంలో వ‌లె స్కూలు కాగానే పుస్త‌కాలు ప‌ట్టుకుని అలా ట్యూష‌న్‌కి ప‌రిగెట్ట‌న‌వ‌స‌రం లేదు. ఈ రోజుల్లో పిల్ల‌ల‌కు అంతా ఆన్‌లైన్ బోధ‌నా సౌక‌ర్యం బాగా అందుబాటులోకి వ‌చ్చేసింది. స్కూల్ అయిపోగానే ట్యాబ్ ల ముందో, స్మార్ట్ ఫోన్లు చేపబట్టుకునో పిల్లలకు పాఠాలు చెప్పేసే యాప్ లు అందుబాటులోకి వచ్చేశాయి.కొత్తొక వింత అన్నట్లు ఇవి పిల్లలో విద్య పట్ల ఆసక్తి అభిరుచి పెంచేస్తాయని తల్లిదండ్రులూ నమ్మేస్తున్నారు. కాదు కాదు  నమ్మేలా అడ్వర్టైజ్ మెంట్లతో యెడ్యూ టెక్ యాప్ లు ఊదరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా వాటకి తోడైంది.  నిజానికి ఈ ఎడ్యూటెక్ యాప్‌లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని.. భారీగా డబ్బులు గుంజుతున్నాయని విమర్శలు ఉన్నాయి.  ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో వీటి విజృంభణ ప్రారంభం కాలేదు. బైజూస్ స్టార్టప్‌గా ప్రారంభించి కాస్త ఆదరణ పొందగానే పెట్టుబడులు సమీకరించి.. ఇతర ఎడ్యూటెక్ స్టార్టప్‌లను కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంది. వాస్తవానికి ఇలాంటి ఎడ్యూటెక్ యాప్ ల వల్ల    విద్యార్థుల మనుసులు కలుషితం అవుతాయనీ.. లాభార్జన  వీటి లక్ష్యం తప్ప విద్యార్థుల భవిష్యత్ కాదనీ.. విద్యను వ్యాపారం చేసేస్తున్నాయన్న ఆరోపణలు కోకొల్లలు.

 

 

 

Post Midle

ఇప్పటికే యెడ్యూటెక్ లు విద్యార్థుల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయంటే చైనా వాటిని తమ దేశంలో నిషేధించింది. పలు దేశాలు అదే దారిలో ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు సైతం యెడ్యూటెక్ యాప్ లపై పలు ఆంక్షలు విధించాయి. వాస్తవం ఇలా ఉండగా..జగన్ సర్కార్ మాత్రం విద్యా విధానంలో పెద్ద సంస్కరణగా అభివర్ణిస్తూ జగన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ తరహా బోధనను అందించాలని సంకల్పించారు.దీని కోసం దేశంలోనే అతి పెద్ద యెడ్యుకేషన్ టెక్ కంపెనీగా గుర్తింపు పొందిన బైజూస్ లో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ప్ర‌బుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు మ‌రింత నాణ్య‌మైన విద్య అందించ‌డానికి ఎంతో వీలుంటుంద‌ని జ‌గ‌న్ అంటుంటే..    రాష్ట్రంలో విద్యను మరింత నాశనం చేసే యత్నంగా విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  అయితే జగన్ మాత్రం పిల్లలకు మంచి జరుగుతుంది, వారికి కాస్ట్‌లీ చదువులను అందజేస్తున్నామంటూ వాదిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.నిజమే ఇది నిజంగా కాస్ట్లీ వ్యవహారమే. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల్లో యెడ్యూ టెక్ కు అవసరమైన ఇన్ఫ్రాస్టర్చర్, ఒప్పందం మేరకు చెల్లింపులు కచ్చితంగా ప్రభుత్వానికి కాస్ట్లీయే. కానీ ఇక్కడ వ్యయం, ఖరీదు కాదు.. అసలు వాస్తవం   ఇక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల రిక్రూట్ మెంట్ అనేది లేకుండా చేయడమే జగన్ ఉద్దేశం అని పరిశీలకులు అంటున్నారు.

 

Tags: No more teacher recruitments ..?

Post Midle
Natyam ad