టీడీపీకి ఎవ్వరూ రాజీనామా చేయలేదు

Date:13/01/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటోంది పార్టీ. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రవీణ్‌ అనే వ్యక్తి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని.. టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌పై కుట్ర జరుగుతోందని ఆ సెల్‌ అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్‌కు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని.. కనీసం ఆయనకు పార్టీ సభ్యత్వం కూడా లేదన్నారు. ప్రవీణ్‌ మరోసారి టీడీపీ పేరు వినియోగించినా, ప్రచారంలో పార్టీ ఫొటోలు వాడినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్రైస్తవుల మద్దతు ఎప్పుడూ టీడీపీకే ఉంటుందని మ్యానీ హెచ్చరించారు. క్రైస్తవుల మద్ధతు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే ఉంటుంది అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు క్రైస్తవులపై చేసినవ్యాఖ్యలకు నిరసనగా క్రిస్టియన్‌ సెల్‌లో పలువురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ విభాగం వివిధ జిల్లాల నాయకుల సమావేశం జరిగింది.

 

 

చిత్తూరు జిల్లా క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు వై.ప్రవీణ్‌‌తో పాటూ మిగిలిన జిల్లాల అధ్యక్షులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ఈనెల 5న క్రైస్తవ సమాజాన్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు విస్తుపోయారని.. క్రైస్తవం మతం కాదు, ఒక మార్గం మాత్రమే అన్నారు. ఎవరు ఏది కోరుకుంటారో వారు దానిని ఆచరిస్తారని అన్నారు. దానిని మత మార్పిడి అని ఎలా అంటారని ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లాల అధ్యక్ష పదవులకు పలువురు రాజీనామాలు చేసినట్టు తెలిపారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: No one has resigned from the TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *